CEC జ్ఞానేశ్ కుమార్ పై రాములమ్మ ఫైర్

by Muthe.Rajitha |   (  Updated:2025-08-18 16:44:43  IST  )

ఓట్ల చోరిపై ఆధారాలు చూపండి లేదా క్షమాపణ చెప్పండి అంటూ చేసిన చీఫ్ ఎలక్షన్ కమీషనర్ ప్రెస్ మీట్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ రాములమ్మ అలియాస్ విజయశాంతి మండిపడ్డారు.

CEC జ్ఞానేశ్ కుమార్ పై రాములమ్మ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : ఓట్ల చోరిపై ఆధారాలు చూపండి లేదా క్షమాపణ చెప్పండి అంటూ చేసిన చీఫ్ ఎలక్షన్ కమీషనర్ ప్రెస్ మీట్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ రాములమ్మ అలియాస్ విజయశాంతి మండిపడ్డారు. CEC జ్ఞానేశ్ కుమార్ వ్యాఖ్యలు రాజ్యాంగ సంస్థ ప్రతినిధి లాగా కాకుండా బీజేపీ అధికార ప్రతినిధి మాదిరిగా ఉన్నాయని అన్నారు. 'కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ పనితీరుపై దేశ ప్రజల్లో ఉన్న అనుమానలను ప్రస్తావించారు.. ఓట్ల చోరిపై తన వద్ద ఉన్న ఆధారాలతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. రాహుల్ గాంధీ గారు చెప్పిన వివరాల్లో వాస్తవాలు ఉంటే వాటిని పరిశీలించి దొంగ ఓట్లను తొలగించి, ఓట్ల చోరిని నిరోధించడం ఎన్నికల కమిషన్ బాధ్యత.

తాను చెయ్యాల్సిన అసలు పనిని విస్మరించి.. బీజేపీ లీడర్స్ రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ చీఫ్ ఎలక్షన్ కమీషనర్ ప్రెస్ మీట్ లో మాట్లాడిన తీరు పక్కా పొలిటిషన్ ను తలపిస్తోంది. వందమంది దోషులు తప్పించుకోవచ్చు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అన్న ప్రాధమిక రాజ్యాంగ సూత్రానికి అనుగుణంగా.. వెయ్య దొంగ ఓట్లను తొలగించ వచ్చు కానీ ఒక అసలు ఓటర్ పేరును తొలగించి పౌరుడి ప్రాథమిక హక్కును కాలరాయడం రాజ్యాంగ విరుద్ధం' అని రాహుల్ గాంధీ పోరాడుతున్నారు.

'కాంగ్రెస్ పార్టీ చేసే వాదనలో విశ్వసనీయత ఉంది కాబట్టే ఓట్ల చోరిపై సమాధానం చెప్పకుండా చీఫ్ ఎలక్షన్ కమీషనర్ పొలిటికల్ ఛాలెంజ్ విసరడం ఆయన స్థాయిని తగ్గించే విధంగా ఉంది. ఎలక్షన్ కమిషన్ మోడీ గవర్నమెంట్ కి తొత్తులా మారిందన్న ఆరోపణలు రావడం వల్లే 2023 మార్చ్ నెలలో సుప్రీం కోర్టు చారిత్రక ఉత్తర్వులు జారిచేసింది. ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పని చేసేందుకు, చీఫ్ ఎలక్షన్ కమీషనర్ లేదా ఎలక్షన్ కమీషనర్ ల నియామకానికి ఒక కమిటీ ని నియమించాలని.. ఆ కమిటీ లో ప్రతిపక్ష నేతకు కూడా స్థానం కల్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం చీఫ్ ఎలక్షన్ కమీషనర్ వైఖరిని చూస్తుంటే సుప్రీం కోర్టు దూర దృష్టితో ఎందుకు ప్రతిపక్ష నేతను ఈ కమిటీలో చేర్చాలని సూచించిందో అర్ధమవుతోంది' అన్నారు.

'నిజానికి బీహార్ లో ఓట్ల తొలగింపుపై సుప్రీం కోర్టు లో ఇటీవల దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయమూర్తులు.. ఓట్ల తొలగింపుపై ఎలక్షన్ కమిషన్ పూర్తి వివరాలను కోర్టు కి సమర్పించాలని ఆదేశించారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఉలిక్కి పడ్డ ఎలక్షన్ కమిషన్ డామేజ్ కంట్రోల్ లో భాగంగా బీహార్ లో ఓటర్ లిస్ట్ నుంచి తొలగించిన పేర్లను పరిశీలించి మళ్ళీ జాబితాలో చేర్చేందుకు సిద్ధపడుతోందనే వార్తలు వస్తున్నాయి.

అదే గనుక జరిగితే.. రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేయడం వల్లే ఓటు హక్కు కోల్పోయిన వారు తిరిగి తమ హక్కును వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుంది. ఈ మొత్తం ఎపిసోడ్ ను చుస్తే.. "offence is best way of diffence" అన్న చందంగా తప్పును రాహుల్ గాంధీగారి మీదకు నెట్టేసి, తప్పించుకోవాలని చూస్తున్న చీఫ్ ఎలక్షన్ కమీషనర్ పై ఇండి కూటమి అవసరమైతే అవిశ్వాస తీర్మానం తీసుకువచ్చి CEC నిజస్వరూపాన్ని త్వరలో బయట పెట్టే అవకాశం కూడా లేకపోలేదు' అని రాములమ్మ మండిపడ్డారు.

Next Story