- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇది తెలంగాణ సత్తా.. రాములమ్మ సంచలన పోస్ట్ !
తెలంగాణ ( Telangana) ఆచరించింది... దేశం అనుసరిస్తుందని కుల గణన ( Caste enumeration) ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ( Telangana) ఆచరించింది... దేశం అనుసరిస్తుందని కుల గణన ( Caste enumeration) ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ విజయశాంతి ( Vijayashanthi ) పోస్ట్ పెట్టారు. ఇండియాలో త్వరలో ప్రారంభం కాబోయే జనాభా లెక్కల సేకరణతో పాటు కులగణన చేపట్టాలని మోడీ ప్రభుత్వం ( Modi Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం కీలక ప్రకటన కూడా చేసింది మోడీ సర్కార్.
అయితే దీనిపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ( Congress)... వరుసగా ప్రెస్ మీట్ పెట్టి స్పందిస్తున్నారు. ఇప్పటి కే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Cm Revanth reddy)... తన నివాసంలో ఇదే అంశంపై ప్రెస్ మీట్ పెట్టి... కీలక వ్యాఖ్యలు చేశారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకొని మోడీ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని చెప్పుకొచ్చారు.
ఇలాంటి నేపథ్యంలో ఇదే అంశంపై విజయశాంతి స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన కులగనన దేశానికి రోల్ మోడల్ అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం... తెలంగాణ ప్రభుత్వ ఘనత అంటూ చెప్పుకొచ్చారు విజయశాంతి. భారత్ జోడోయాత్రలో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ప్రకారం... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల గణన ప్రక్రియ పూర్తి చేసిందని గుర్తు చేశారు. ఇది తెలంగాణ సత్తా అన్నారు. కేంద్ర కేబినెట్ లో దేశవ్యాప్తంగా కుల గణనను ఆమోదించడం స్వాగతిస్తున్నామని పోస్ట్ పెట్టారు విజయ శాంతి.






