Buddha Venkanna : విజయసాయి రాజీనామా ఓ డ్రామా : బుద్ధ వెంకన్న

by Y. Venkata Narasimha Reddy |

వైసీపీ ముఖ్యనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) రాజీనామా నిర్ణయంపై టీడీపీ (TDP)నేత బుద్దా వెంకన్న(Buddha Venkanna) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Buddha Venkanna : విజయసాయి రాజీనామా ఓ డ్రామా : బుద్ధ వెంకన్న
X

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ ముఖ్యనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) రాజీనామా నిర్ణయంపై టీడీపీ (TDP)నేత బుద్దా వెంకన్న(Buddha Venkanna) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజీనామా ఎపిసోడ్ జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి కలిసి ఆడుతున్న డ్రామా అని ఎక్స్ వేదికగా ఆరోపించారు. వైఎస్ జగన్ కి తెలిసే ఇదంతా జరుగుతుందని..కేసులను పక్కదారి పట్టించడానికి ఆడుతున్న నాటకమని విమర్శించారు.

చంద్రబాబుతో వ్యక్తిగత విభేదాలు లేవు అంటే నమ్మెంత పిచ్చోళ్లు కాదు ప్రజలని వ్యాఖ్యానించారు. విజయసాయి రెడ్డి సీఎం చంద్రబాబు(CM Chandrababu)ను అన్న ప్రతి మాట మాకు గుర్తుందన్నారు. చేసినవన్ని చేసి ఈరోజు రాజీనామా చేసి వెళ్లిపోతా అంటే కుదరదన్నారు. ఆయన చేసిన భూకబ్జాలు, దోపిడీలు ఉత్తరాంధ్రలో చేసిన అరాచకాలు ప్రతి దానికి లెక్క తేలాల్సిందేనన్నారు. దేశం విడిచి వెళ్లేందుకు విజయసాయిరెడ్డికి సీబీఐ(CBI) అనుమతి ఇవ్వకూడదన్నారు.

ఎన్ని నాటకాలు ఆడినా ఎవరు క్షమించినా నేను మాత్రం విజయసాయిరెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై విజయసాయిరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌కు బుద్దా వెంకన్న డిసెంబర్ లో ఫిర్యాదు సైతం చేయడం ఈ సందర్భంగా గమనార్హం.

Next Story