అక్రమ సంబంధం ఆరోపణల వల్లే విజయారెడ్డి సూసైడ్! చర్లపల్లి ట్రిబుల్ సూసైడ్ కేసులో కీలక మలుపు

by Prasad Jukanti |   (  Updated:2026-04-13 15:19:11  IST  )

చర్లపల్లి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విజయారెడ్డి ఆత్మహత్య కేసులో కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి.

అక్రమ సంబంధం ఆరోపణల వల్లే విజయారెడ్డి సూసైడ్! చర్లపల్లి ట్రిబుల్ సూసైడ్ కేసులో కీలక మలుపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: చర్లపల్లిలో తన కొడుకు, కూతురితో కలిసి రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్యకు పాల్పడిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ విజయారెడ్డి కేసు కీలక మలుపు తిరిగింది. ఆత్మహత్య జరిగిన మూడు నెలల తర్వాత తాజాగా తన ప్రాణాలకు హాని ఉందంటూ విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి పోలీసులను ఆశ్రయించడం సంచలనంగా మారింది. నా భార్య బిడ్డలు చనిపోయిన 25 రోజులకే ఆస్తుల కోసం విజయారెడ్డి తల్లి తరపు బంధువులు పలుమార్లు తనను బెదిరించారని ఆరోపించగా, అసలు విజయారెడ్డి చావుకు ఆమె భర్త సురేందర్ రెడ్డి, అతడి తల్లిదండ్రుల వేధింపులే కారణం అంటూ మృతురాలి తల్లి తరపు బంధువులు ఆరోపించడం ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది.

ఎఫైర్లు అంటగట్టడం వల్లే!:

తన కూతుర్ని సురేందర్ రెడ్డి అనుమానించేవాడని, వరకట్నం తేవాలని, ఉద్యోగం చేస్తూ డబ్బులు సంపాదించాలని నిత్యం వేధించేవాడని విజయారెడ్డి తల్లి సంచలన ఆరోపణలు చేసింది. ఇక విజయారెడ్డి సోదరుడు మాట్లాడుతూ.. సురేందర్ రెడ్డి తన సోదరి కంటే 17 ఏళ్లు పెద్దవాడని, ఈ విషయం దాచి పెళ్లి చేసుకున్నాడని, అలాగే వరక్నటం తేవాలని వేధించేవారని ఆరోపించారు. జాబ్ చేయాలని ఒత్తిడి చేస్తే తన సోదరి జాబ్‍కు వెళ్లిందని అక్కడ నైట్ షిప్టులు వస్తే ఎవరితోనో అక్రమ సంబంధం ఉందని అందుకే నైట్ షిప్టుల్లో డ్యూటీ చేస్తున్నావ్, నైట్ షిప్ట్ లో చేసే వారు అంతా ఇంతే అంటూ రోజూ వేధించే వాడని ఆరోపించారు. ఇక విజయారెడ్డి సోదరుడి భార్య మాట్లాడుతూ సురేందర్ రెడ్డి విజయారెడ్డిని నిత్యం అనుమానించేవాడని ఆరోపించింది. ఆమె టాటూ వేయించుకుంటే ఎవరికోసం వేయించుకున్నావ్ అనే వాడని, కార్ డ్రైవింగ్ నేర్చుకుంటే ఒంటరిగా ఎవరి వద్దకు వెళ్లేందుకు డ్రైవింగ్ నేర్చుకుంటున్నావ్ అంటూ అనుమానించాడని చెప్పుకొచ్చింది.

ఎవరు రాసిన మరణ శాసనం ఇది?:

కాగా విజయారెడ్డి మరణం విషయంలో ఇరువైపుల వాదనలు ఎలా ఉన్నా కన్నబిడ్డలతో పాటు ఆత్మహత్యకు పాల్పడాల్సిన నిర్ణయానికి అసలు కారణం ఏంటనేది సస్పెన్స్ గానే మారింది. ఆమె మరణించిన దాదాపు మూడు నెలలకు ఇరువైపుల కుటుంబాల నుంచి ఆస్తుల కోసం ఘర్షణ పడటం వెనుక విజయరెడ్డి చావుకు మరణ శాసనం రాసిందెవరు అనేది కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.

Next Story