పెళ్లికి పిలవలేదని అలిగిన బుజ్జి అభిమాని.. ఇంటికి పిలిచి ‘స్పెషల్ ట్రీట్’ ఇచ్చిన విజయ్-రష్మిక!

by Ramesh Naini |   (  Updated:2026-03-20 13:01:16  IST  )

టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న (విరోష్) తమ పెద్ద మనసును చాటుకున్నారు.

పెళ్లికి పిలవలేదని అలిగిన బుజ్జి అభిమాని.. ఇంటికి పిలిచి ‘స్పెషల్ ట్రీట్’ ఇచ్చిన విజయ్-రష్మిక!
X

దిశ, డైనమిక్ బ్యూరో: టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న (విరోష్) తమ పెద్ద మనసును చాటుకున్నారు. ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట, కేవలం వేడుకలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా పలు ఆలయాల్లో అన్నదానాలు చేస్తూ, అభిమానులకు స్వీట్లు పంచుతూ వార్తల్లో నిలిచారు. ఈ క్రమంలో ఇటీవల తనను పెళ్లికి పిలవలేదని బుజ్జి అభిమాని అలిగిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయం విరోష్ దృష్టికి రావడంతో చిన్నారి ఇంటికి పిలిచి నచ్చిన భోజనం పెడతామని మాట ఇచ్చారు. అయితే, ఇచ్చిన మాట ప్రకారం చిన్నారిని, తన కుటుంబాన్ని తాజాగా ఇంటికి పిలిచి స్పెషల్ ట్రీట్ ఇచ్చారు.

వైరల్ అయిన చిన్నారి వీడియో..

‘మేము కూడా విజయ్ దేవరకొండ, రష్మిక ఫ్యాన్స్ యే కదా.. నన్ను పెళ్లికి ఎందుకు పిలవలేదు? అందరికీ లడ్డూలు ఇస్తున్నారు, అన్నదానం చేస్తున్నారు.. మమ్మల్ని కూడా పిలిస్తే ఏమైతుందంటా?’ అంటూ ఓ చిన్నారి అత్యంత అమాయకంగా, క్యూట్‌గా చేసిన ఇన్‌స్టా రీల్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన విషయం తెలిసిందే. తన అభిమాన హీరో పెళ్లికి తనను పిలవలేదన్న ఆ పాప అలక రౌడీ స్టార్ దృష్టికి వెళ్ళింది.

ఇంటికి పిలిచి ప్రత్యేక విందు ఇచ్చిన ‘విరోష్’

అభిమాని కోరికను గౌరవిస్తూ విజయ్ దేవరకొండ తక్షణమే స్పందించారు. ఆ చిన్నారిని, ఆమె కుటుంబాన్ని ప్రత్యేకంగా తన ఇంటికి ఆహ్వానించారు. రష్మిక, విజయ్ కలిసి ఆ పాపతో సరదాగా గడపడమే కాకుండా, స్వయంగా దగ్గరుండి భోజనం తినిపించారు. ఈ వీడియోను ఆ చిన్నారి (urs_luckythalli ) తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. ప్రస్తుతం ఈ విందు వేడుకకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మొత్తానికి సాధించావ్ బుజ్జి తల్లి అంటూ నెటిజన్‌లు కామెంట్స్ చేశారు. అభిమానుల పట్ల ఈ స్టార్ కపుల్ చూపిస్తున్న ప్రేమాభిమానాలపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Next Story