KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు బీగ్ షాక్.. లీగల్ నోటీసులు పంపిన ఫెడరేషన్!

by Ramesh Naini |   (  Updated:2025-02-03 10:50:45  IST  )

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు బీగ్ షాక్ తగిలింది. ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ సోమవారం లీగల్ నోటీసులు పంపింది.

KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు బీగ్ షాక్.. లీగల్ నోటీసులు పంపిన ఫెడరేషన్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్‌ (former CM KCR)కు బీగ్ షాక్ తగిలింది. అసెంబ్లీకి గైర్హాజరు నేపథ్యంలో కేసీఆర్‌‌కు ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ సోమవారం లీగల్ నోటీసులు పంపింది. ఈ మేరకు కేసీఆర్‌కు (Federation Of Farmers Association in Telangana) ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ తరపు న్యాయవాది పాదూరి శ్రీనివాస్ రెడ్డి మెయిల్, స్పీడ్ పోస్ట్ ద్వారా లీగల్ నోటీసులు పంపించారు. అసెంబ్లీకి హాజరుకాని కేసీఆర్‌పై అనర్హత వేటు వేయాలని అసోసియేషన్ జనరల్ సెక్రటరీ విజయ్‌పాల్‌ (Vijay Paul) కోరారు.

(TG Assembly) శాసన సభలో అపోజిషన్ లీడర్‌గా తన కర్తవ్యాన్ని నిర్వర్తించని మాజీ సీఎం కేసీఆర్‌కు సభలో సభ్యునిగా కొనసాగే అర్హత లేదని నోటీసులో వెల్లడించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో కేసీఆర్‌ పోరాటం చేయాలని, లేదంటే అసెంబ్లీకి రాని కేసీఆర్‌ను వెంటనే అపోజిషన్ లీడర్‌గా తొలగించాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌కు స్పీకర్‌ సమన్లు జారీ చేసి వివరణ కోరాలని విజయ్‌ పాల్‌ కోరారు.

కాగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ అపోజిషన్ లీడర్‌గా పదవి తీసుకున్నారు. కాలుజారి పడటంతో కేసీఆర్ కొంతకాలం విశ్రాంతి తీసుకుంటూ పూర్తిగా ఫాంహౌజ్‌కే పరిమితమయ్యారు. ఒకే ఒక్కసారి ఆయన సభకు హాజరయ్యారు. తర్వాత ఆయన అసెంబ్లీకి రాలేదు. అసెంబ్లీకి రావాలని కాంగ్రెస్, బీజేపీ నాయకులు పదే పదే కోరుతున్నా ఆయన స్పందించడం లేదు.

Next Story