- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హసనపర్తి రైస్ మిల్లు పై విజిలెన్స్ దాడులు
విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సెమెంట్ వరంగల్ యూనిట్ పరిధిలో సివిల్ సప్లై అధికారులతో సంయుక్తంగా రైస్ మిల్లుల పై మంగళవారం తనిఖీలు నిర్వహించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సెమెంట్ వరంగల్ యూనిట్ పరిధిలో సివిల్ సప్లై అధికారులతో సంయుక్తంగా రైస్ మిల్లుల పై మంగళవారం తనిఖీలు నిర్వహించారు. హన్మకొండ జిల్లా హసనపర్తి మండలం ముచ్చర్ల గ్రామంలో వెంకటేశ్వర రైస్ మిల్ లో ధాన్యం స్టాక్ పై తనిఖీలు చేపట్టారు. 2022–23 రబీ సీజన్‌కు సంబంధించి 4,061 క్వింటాళ్లు, 2024–23 రవీ సీఎంఆర్‌కు సంబంధించి 18,385క్వింటాళ్ల ధాన్యం మొత్తంగా 22,446క్వింటాళ్ల తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
ధాన్యం విలువ రూ.5.16కోట్లు ఉంటుందని పేర్కోన్నారు. చర్యలు చేపట్టేందుకు హన్మకొండ సివిల్ సప్లై జిల్లా అధికారికి సిఫార్స్ చేసినట్లు విజిలెన్స్ అధికారులు పేర్కోన్నారు. హైదరాబాద్ యూనిట్ 1 పరిధిలో రూట్ చెకింగ్ నిర్వహించినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. 26 వాహనాలపై కేసులు నమోదు చేసి రూ.4.45లక్షల జరిమానా విధించినట్లు పేర్కోన్నారు.
- Tags
- Vigilance






