HCA vs SRH.. జగన్ మోహన్ రావుకు విజిలెన్స్ అధికారుల పిలుపు

by Gantepaka Srikanth |

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA), సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం(SRH) మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.

HCA vs SRH.. జగన్ మోహన్ రావుకు విజిలెన్స్ అధికారుల పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA), సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం(SRH) మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. పాసులు, ఫ్రీ టికెట్లు అంటూ హెచ్‌సీఏ తమను వేధిస్తోందంటూ ఎస్ఆర్‌హెచ్‌ ఆరోపణలు చేస్తోంది. ఈ వివాదంపై సోమవారం స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఆదేశాలు వచ్చిన వెంటనే రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు(Vigilance officers) ఉప్పల్ స్టేడియం(Uppal Stadium)లో విచారణ ప్రారంభించారు. ఎస్‌ఆర్‌హెచ్, హెచ్‌సీఏ మధ్య జరిగిన ఈమెయిల్స్‌ని చెక్ చేస్తున్నారు.

ఐపీఎల్‌కు ముందు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాలపైనా విచారిస్తున్నారు. ఇప్పటికే గత రెండు సంవత్సరాలుగా హెచ్‌సీఏ చేపట్టిన రెనువేషన్స్ వాటికి సంబంధించిన లెక్కలు పరిశీలిస్తున్నారు. ఎస్‌ఆర్‌హెచ్, హెచ్‌సీఏ మధ్య ఐపీఎల్‌కు ముందు జరిగిన ఒప్పందాలకు సంబంధించిన రికార్డ్స్‌ను పరిశీలిస్తున్నారు. కాసేపట్లో డీజీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి(DG Kothakota Srinivas Reddy) ఉప్పల్ స్టేడియం‌కు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావుకు విజిలెన్స్ అధికారుల పిలుపునిచ్చారు. రేపు విచారణకు రావాలంటూ సమాచారం ఇచ్చారు.

ఇదిలా ఉండగా.. ఎస్ఆర్‌హెచ్ ఫ్రాంచైజీ(SRH Franchise) ఉప్పల్ స్టేడియాన్ని హోం గ్రౌండ్‌గా చేసుకుని ఐపీఎల్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇన్నాళ్లు బాగానే ఉన్నా.. రెండేళ్ల క్రితం నుంచే తమకు వేధింపులు మొదలయ్యాయని సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్‌ ఆరోపణలు చేస్తోంది. ఈ ఒత్తిళ్లను తట్టుకోలేక సన్‌రైజర్ యాజమాన్యం(Sunrisers Hyderabad) ఇతర రాష్ట్రాలకు వెళ్తే.. ప్రభుత్వం బ్లేమ్ అవుతుందని విషయం గ్రహించిన రేవంత్ రెడ్డి(CM Revanth Reddy).. వెంటనే విజిలెన్స్ విచారణకు ఆదేశించారు.

Next Story