- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజిలెన్స్ ఆకస్మిక దాడులు.. శంషాబాద్ రూట్ చెకింగ్.. 17 వాహనాలపై కేసు నమోదు: డీజీ శిఖా గోయల్
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, వరంగల్ యూనిట్ చెపట్టిన ఆకస్మిక తనిఖీల్లో రూ.3.81 కోట్ల విలువైన ధాన్యం దారి మళ్ళించినట్లు గుర్తించినట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ శిఖా గోయల్ శనివారం వెల్లడించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (Vigilance and Enforcement), వరంగల్ యూనిట్ చెపట్టిన ఆకస్మిక తనిఖీల్లో రూ.3.81 కోట్ల విలువైన ధాన్యం దారి మళ్ళించినట్లు గుర్తించినట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ శిఖా గోయల్ (DG Shikha Goyal) శనివారం వెల్లడించారు. ములుగు జిల్లాలోని మల్లంపల్లిలో ఉన్న శ్రీ అచ్యుత అగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లును వరంగల్ యూనిట్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీ చేసి, స్టాక్ తక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కోన్నారు. 2024-25 రబీ సీజన్‌కు సంబంధించిన 4,780.80 క్వింటాళ్ల ధాన్యం, 2022-23 రబీ వేలం ధాన్యం 11,191.26 క్వింటాళ్లు, మొత్తం 15,972.06 క్వింటాళ్ల ధాన్యం దారి మళ్లినట్లు వెల్లడించారు. ఈసీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడానికి ములుగు జిల్లా పౌరసరఫరాల అధికారికి సిఫార్సు చేసినట్లు పేర్కొన్నారు.
శంషాబాద్ లో రూట్ చెకింగ్..
హైదరాబాద్ రూరల్ యూనిట్, ఆర్టీఏ అధికారులు, మైనింగ్ శాఖ అధికారులు సంయుక్తంగా చెపట్టిన ఆకస్మిక రూట్ తనిఖీల్లో రూ.6.27లక్షల పన్ను విధించినట్లు డీజీ పేర్కోన్నారు. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ ఓఆర్ఆర్ వద్ద చేపట్టిన ఆకస్మిక తనిఖీలలో 17 వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మైన్స్ అండ్ మినరల్స్ చట్టం కింద 8 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.






