- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రచయితగా మారిన విజిలెన్స్ డీజీ
by Ajay Maddhiboyina |
పోలీస్ శాఖలో 31 సంవత్సరాలు వివిధ హోదాలలో ఐపీఎస్‌గా సేవలందించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి రచయితగా కొత్త బాట పట్టారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: పోలీస్ శాఖలో 31 సంవత్సరాలు వివిధ హోదాలలో ఐపీఎస్‌గా సేవలందించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి రచయితగా కొత్త బాట పట్టారు. పుంజుతోక పేరిట పుస్తకాన్ని రచించారు. 1994 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన కొత్తకోట శ్రీనివాసరెడ్డి తాను పనిచేసిన ప్రాంతాలలో స్వీయ అనుభవాలు, అక్కడి పరిస్థితులపై పుస్తక రూపంలో వెల్లడించారు. విధి నిర్వహణలో తన దైన శైలిని, సమాజంలోని రుగ్మతలు, మానవ సంబంధాల పట్ల స్పందిస్తూ అక్షర రూపం ఇచ్చారు. ఆయన రచించిన పుంజు తోకలో వీర,శాంత, రౌద్ర, అద్భుత, కరుణ, హాస్య, భీభత్స తదితర అంశాలను ప్రస్తావించారు. పుంజుతోక(కాక్టయిల్) లో 120 అంశాలపై కవితలు రచించారు. విధి నిర్వహణలో ముక్కుసూటిగా కొనసాగిన కొత్తకోట శ్రీనివాసరెడ్డి రచనా రంగంలోనూ తనదైన శైలిలో పదునైన పదాలను ప్రయోగించారు.
Next Story






