వారం రోజుల పాటు విజిలెన్స్ అవగాహన కార్యక్రమాలు

by Muthe.Rajitha |

విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ లోగో, టోటల్-ఫ్రీ నంబర్ పోస్టర్ల ఆవిష్కరణ, అవగాహన వారోత్సవాన్ని బీఆర్ కే భవన్‌లో సోమవారం ప్రారంభించారు.

వారం రోజుల పాటు విజిలెన్స్ అవగాహన కార్యక్రమాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ లోగో, టోటల్-ఫ్రీ నంబర్ పోస్టర్ల ఆవిష్కరణ, అవగాహన వారోత్సవాన్ని బీఆర్ కే భవన్‌లో సోమవారం ప్రారంభించారు. రిటైర్డ్ ఐఏఎస్ విజిలెన్స్ కమిషనర్ గోపాల్‌తో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ శిఖా గోయల్ కలిసి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారిక లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2వ తేది వరకు వారం రోజుల పాటు విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో విజిలెన్ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ 144321ను ప్రారంభిస్తున్నట్లు డీజీ శిఖాగోయల్ తెలిపారు. టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ ప్రారంభించడం ద్వారా ప్రజా సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయన్నారు. విజిలెన్స్ విభాగం సమగ్రత, పారదర్శకత జవాబుదారీతనాన్ని సూచిస్తుందని తెలిపారు. విజిలెన్స్ అంటే తప్పులను పట్టుకోవడం గురించి కాదని, వాటిని నివారించడం గురించి అని తెలిపారు. విజిలెన్స్ విభాగం ఎక్స్, ఇన్‌స్ట్రాగ్రామ్, అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్‌లను ప్రవేశపెట్టిందని పేర్కోన్నారు.

Next Story