బండి భగీరథ్‌‌ను సపోర్ట్ చేస్తూ వీడియోలు.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు

by Kema Shiva Kumar |

పోక్సో నిందితుడు బండి భగీరథ్ కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మొత్తం 14 మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై పేట్ బషీరాబాద్ పీఎస్‌లో కేసులు నమోదయ్యాయి.

బండి భగీరథ్‌‌ను సపోర్ట్ చేస్తూ వీడియోలు.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన బండి భగీరథ్ (Bandi Bhagirath) పోక్సో (POCSO) కేసులో సిట్ ఇప్పటికే దర్యాప్తును ముమ్మరం చేసింది. అయితే, ఈ కేసులో తాజాగా మరో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. నిందితుడికి మద్దతుగా సోషల్ మీడియాలో ప్రచారం చేసినందుకు గానూ 14 మంది ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై (Social Media Influencers) పోలీసులు కేసులు నమోదు చేశారు.

డబ్బు తీసుకుని యథేచ్ఛగా వీడియోలు..

అయితే, పోక్సో చట్టం కింద తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు బండి భగీరథ్‌కు అనుకూలంగా సోషల్ మీడియా వేదికల్లో కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్లు వరుసగా పోస్టులు, వీడియోలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుడి ఇమేజ్‌ను క్లీన్ చేయడానికి వీరంతా పెద్ద ఎత్తున డబ్బు తీసుకుని, నిబంధనలకు విరుద్ధంగా కంటెంట్ (Paid PR Content) చేసినట్లు అనుమానిస్తున్నారు. పోక్సో కేసు నిందితులకు అనుకూలంగా ప్రచారం చేయడం, బాధితుల వివరాలను పరోక్షంగా ప్రస్తావించడం చట్టరీత్యా నేరం కావడంతో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌ (Pet Basheerabad Police Station)లో మొత్తం 27 మందిపై ఫిర్యాదు అందింది. నిందితుడి తరఫున తప్పుడు ప్రచారం చేస్తూ.. విచారణను పక్కదారి పట్టించేలా వ్యవహరిస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు ప్రాథమిక విచారణ జరిపారు. ప్రాథమిక ఆధారాలు లభించడంతో మొదటి విడతగా మొత్తం 14 మంది ఇన్‌ఫ్లుయెన్సర్లపై అధికారికంగా ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేశారు. మిగిలిన వారిపై కూడా విచారణ జరిపి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Next Story