TG: మేడారం డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల.. చూస్తే వావ్ అనాల్సిందే (వీడియో)

by Gantepaka Srikanth |

మేడారం అభివృద్ధి(Medaram Development)పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే.

TG: మేడారం డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల.. చూస్తే వావ్ అనాల్సిందే (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: మేడారం అభివృద్ధి(Medaram Development)పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) ములుగు జిల్లా మేడారం(Medaram)లో పర్యటించారు. సమ్మక్క-సారలమ్మ అమ్మవార్ల గద్దెలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం ఆలయ అభివృద్ధి పనులపై అధికారులతో సీఎం సమీక్షించారు. ఆసియా ఖండంలోనే అతి పెద్ద‌దైన మేడారం ఆదివాసీ గిరిజన జాత‌ర‌ను మ‌రింత ఘ‌నంగా నిర్వ‌హించాలని ఆదేశించారు. లక్షలాది భక్తులు దర్శించుకునేందుకు వీలుగా మేడారంలో భారీ ఎత్తున అభివృద్ధి ప‌నుల‌కు ప్ర‌భుత్వం శ్రీ‌కారం చుట్టారు. స్వాగ‌త తోర‌ణాల నిర్మాణంతో పాటు గ‌ద్దెల వ‌ద్ద‌కు భ‌క్తులు సులువుగా చేరుకోవడం.. గ‌ద్దెల ద‌ర్శ‌నం, బంగారం (బెల్లం) స‌మ‌ర్ప‌ణ‌.. జంప‌న్న వాగులో స్నానాలు ఆచరించేందుకు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. తాజాగా ఇందుకు సంబంధించిన డిజిటల్ మాస్టర్ ప్లాన్‌ను విడుదల చేశారు. ఈ మేరకు ప్రత్యేకంగా వీడియో రూపొందించారు. వీడియో

Next Story