Rain Effect: ఓపెన్ డ్రెయిన్‌లో పడిపోయిన డెలివరీ బాయ్! టీకేఆర్ కమాన్ వద్ద ఘటన వైరల్

by Ramesh Naini |

హైదరాబాద్ నగరంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

Rain Effect: ఓపెన్ డ్రెయిన్‌లో పడిపోయిన డెలివరీ బాయ్! టీకేఆర్ కమాన్ వద్ద ఘటన వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నగరంలో (Hyderabad Rains) గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అయితే నిన్న రాత్రి సమయంలో కురిసిన భారీ వర్షానికి భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఈ క్రమంలోనే వర్షంలో బైక్‌పై ఫుడ్ డెలివరీ చేయడానికి వెళ్తూ ఓపెన్ డ్రెయిన్‌లో జొమాటో డెలివరీ బాయ్ (Zomato delivery) పడిపోయారు. ఈ ఘటన ఎల్బీ నగర్‌‌‌‌ పరిధిలోని టీకేఆర్ కమాన్ వద్ద జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో తాాజాగా నెట్టింట వైరల్ మారింది. అయితే, ఓపెన్ డ్రెయిన్‌లో డెలివరీ బాయ్ పడిపోవడంతో ఫోన్‌ను కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇది గమనించిన స్థానికులు వెంటనే అతన్ని బయటకు తీశారు. తాడు సాయంతో బైక్‌ను వెలికి తీశారు. కనీసం హెచ్చరిక బోర్డు కూడా పెట్టకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని హైడ్రా, జీహెచ్‌ఎంసీ అధికారులపై నెటిజన్‌లు మండిపడ్డారు. మరోవైపు డెలివరీ బాయ్‌కి ఆర్ధిక సాయం చేయాలని నెటిజ‌న్‌లు రిక్వెస్ట్ చేశారు.

ఈ ఘటనపై బాధిత జోమాటో డెలివరీ బాయ్ సయ్యద్ ఫర్హాన్ మాట్లాడుతూ.. తాను సంతోశ్‌నగర్‌ నివాసినని, దాదాపు 6 ఏళ్ల నుంచి డెలివరీ బాయ్‌గా చేస్తున్నట్లు తెలిపారు. నిన్న డెలివరీ చేస్తున్న సమయంలో వర్షం కారణంగా టీకేఆర్ వద్ద నాలాలో పడిపోయినట్లు స్పష్టం చేశారు. నాలా వద్ద వాటర్ లేవల్‌గా ఉండటంతో ప్రమాదం జరిగిందని తెలిపారు. దీంతో ఫోన్ పోయిందని, బైక్ మాత్రం పాడైపోయిందన్నారు. అది కొత్త బైక్ అని, దాని ఈఎంఐలు కూడా కడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. బైక్‌పైనే ఆధారపడి జీవిస్తున్నానని, ఈ మేరకు తనకు సాయం చేయాలని బాధితుడు కోరారు. ట్వీట్ లింక్..

Next Story