Viral video: మంత్రి కొండా సురేఖ క్లీన్ బౌల్డ్..! ఎకో ఫారెస్ట్ పార్క్‌లో సరదా క్రికెట్.. వైరల్

by Ramesh Naini |

మెదక్ జిల్లా నర్సాపూర్ అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఎకో ఫారెస్ట్ టూరిస్ట్ పార్క్ ప్రారంభోత్సవం సరదా సన్నివేశం చోటుచేసుకుంది.

Viral video: మంత్రి కొండా సురేఖ క్లీన్ బౌల్డ్..! ఎకో ఫారెస్ట్ పార్క్‌లో సరదా క్రికెట్.. వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మెదక్ జిల్లా నర్సాపూర్ అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఎకో ఫారెస్ట్ టూరిస్ట్ పార్క్ ప్రారంభోత్సవం సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అటవీ, దేవాదాయ ధర్మాదాయ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) అటవీ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ, క్రికెట్‌ బ్యాట్ పట్టారు. మంత్రి స్వయంగా క్రీజ్‌ దిగడంతో అక్కడి వాతావరణం ఉత్సాహంగా మారింది. బౌలర్ వేసిన బంతిని ఆడబోతూ మంత్రి సురేఖ క్లీన్ బౌల్డ్‌ కావడంతో ప్రేక్షకులు నవ్వుల్లో మునిగిపోయారు. మంత్రి కూడా చిరునవ్వు చిందిస్తూ ఆ క్షణాన్ని సరదాగా తీసుకున్నారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, శనివారం మంత్రి కొండా సురేఖ ఎకో ఫారెస్ట్ పార్కును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలోని ఒక అరుదైన పార్కును ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అన్నారు.

పర్యావరణ పరిరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని, ఎకో పార్క్ వంటి ప్రాజెక్టులు కొత్త తరానికి స్ఫూర్తిని అందించే విధంగా ఉంటాయని అన్నారు. ఇది యువతీ యువకులకు ప్రకృతి ప్రేమను అలవరించడంలో దోహదపడుతుందన్నారు. పార్కులో అరుదైన మొక్కలు, ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయన్నారు. పార్క్‌లో ఏర్పాటు చేసిన వేదికలు, లగ్జరీ సదుపాయాలు, పిక్నిక్ స్పాట్స్, ఈవెంట్స్ ఫెసిలిటీలు, పచ్చదనం లాంటివి అన్ని సందర్శకులను ఆకట్టుకుంటాయని పేర్కొన్నారు. వీడియో ఇదే..

Next Story