- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MIM MLA: నాలా సమస్య.. ఎంఐఎం ఎమ్మెల్యేపై తిరగబడ్డ స్థానికులు.. వీడియో వైరల్
హైదరాబాద్ నగరంలో ఎంఐఎం ఎమ్మెల్యే, అతని అనుచరులపై స్థానికులు తిరగబడి దాడికి యత్నించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నగరంలో ఎంఐఎం ఎమ్మెల్యే, అతని అనుచరులపై స్థానికులు తిరగబడి దాడికి యత్నించారు. నాలా సమస్య పరిష్కరిస్తానంటూ కాలయాపన చేస్తున్నాడని ఎమ్మెల్యేను నిలదీసి, అడ్డొచ్చిన ఎమ్మెల్యే అనుచరులను స్థానికులు చితకబాదినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. నగరంలో ఇటీవల కురిసిన వర్షాలకు (Nala) నాలాలు పరిశీలించడానికి నాంపల్లి ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ (Nampally MIM MLA Zafar Hussain) వచ్చారు. ఈ క్రమంలోనే స్థానికులకు ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
యాకుత్‌పుర (Yakutpura) పరిధిలో నాలా సమస్యను పరిష్కరించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడంలేదని ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్‌ను స్థానికులు నిలదీసినట్లు వీడియో వైరల్ అవుతోంది. వానాకాలం వచ్చినా కూడా నాలా పనులు చేయడం లేదని, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యేకు, స్థానికులకు మధ్య వాగ్వివాదం పెరిగి ఘర్షణకు దారితీసింది. ఎమ్మెల్యేను స్థానిక వ్యక్తులు తోయడంతో గొడవ మరింత ఉధృతంగా మారింది. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే అనుచరులను స్థానికులు చితక బాదారు. ఇక గొడవ పెద్దది కావడంతో అక్కడి నుంచి ఎమ్మెల్యే వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. వీడియో వైరల్ కావడంతో పాత బస్తీలో సైతం చైతన్యం వచ్చిందని ఓ నెటిజన్ కామెంట్ ఆసక్తికరంగా మారింది.






