- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆడపిల్లలకు స్కూటీలు ఎక్కడ..! కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి స్కూటీ రైడ్ వైరల్..
కాంగ్రెస్ యువ నేత, పాలకుర్తి మామిడాల యశస్విని రెడ్డి (MLA Yashaswini Reddy) మరోసారి వార్తల్లో నిలిచారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ యువ నేత, పాలకుర్తి మామిడాల యశస్విని రెడ్డి (MLA Yashaswini Reddy) మరోసారి వార్తల్లో నిలిచారు. తెలంగాణలో అర్హులైన వారికి (Indiramma's houses) ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలు పంపిణీ జోరు కొనసాగుతోంది. ఇందులో భాగంగా యశస్విని రెడ్డి రోడ్డుపై తన అనుచరులతో కలిసి స్కూటీ నడుపుతూ వస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇవాళ (గురువారం) జనగామ జిల్లా దేవరుప్పుల మండలకేంద్రంలోని ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలను అందజేసేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి తిరుమల గార్డెన్ వరకు (Congress) కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి స్కూటీ (scooty) నడిపారు. తన వెంట అనుచరులతో ర్యాలీగా పత్రాలు అందజేసే కార్యాలయం వరకు స్వయంగా స్కూటీ నడుపుతూ రావడం ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ (viral) కావడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెట్టారు. కారులో కాకుండా ఒక సామాన్య మహిళల కార్యక్రమానికి హాజరయ్యారని కొంత మంది నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు.
డ్రైవింగ్ చేసే సమయంలో హెల్మెట్ అనేది ముఖ్యమని, ఒక ఎమ్మెల్యే అయ్యుండి.. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా.. హెల్మెట్ ధరించకుండా స్కూటీ డ్రైవింగ్ చేయడం కరెక్ట్ కాదని నెటిజన్లు ఆమెను విమర్శించారు. ఆడపిల్లలకి స్కూటీలు ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిందని. కాంగ్రెస్ ఎమ్మెల్యే స్కూటీ నడిపితే అదే గుర్తు చేసినట్టు ఉందని, మరి ఆడపిల్లలకు స్కూటీలు ఎప్పుడు ఇస్తారని కొంత మంది నెటిజన్లు ప్రశ్నించారు. కాగా, ఇటీవల తన చేతుల మీదుగా నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను అందజేయడంతో యువ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి భావోద్వేగానికి లోనవ్వడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






