- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లిలో అక్షింతలు పట్టు.. కట్నాలు స్కానర్‌కు కొట్టు..! క్యాష్‌లెస్ కట్నం.. వధువు తండ్రి వినూత్న ఆలోచన
ఓ పెళ్లి వేడుకలో చోటుచేసుకున్న సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఓ పెళ్లి వేడుకలో చోటుచేసుకున్న సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మారుతున్న టెక్నాలజీని వధూవరుల తల్లిదండ్రులు ప అందిపుచ్చుకుంటున్నారనే ఉదాహరణగా ఈ వీడియో నిలిచింది. వైరల్ వీడియో ప్రకారం.. ఓ పెళ్లి మండపంలో వధువు తండ్రి తన జేబులో Paytm స్కానర్ పెట్టుకుని బంధుమిత్రుల నుంచి ‘కట్నాలు’ కానుకలు స్వీకరిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. ‘బుక్‌లో కట్నాలు రాయడం పాత సంప్రదాయం.. స్కానర్‌తో తీసుకోవడం కొత్త సాంప్రదాయం’ అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
పెళ్లిళ్లలో నగదు బదులు Paytm, PhonePe వంటి యాప్‌ల ద్వారా డిజిటల్ గిఫ్ట్‌లు ఇవ్వడం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారిందని చాలామంది అంటున్నారు. టెక్నాలజీ వేగంగా పెరుగుతున్న యుగంలో వధూవరుల తండ్రులు కూడా ‘క్యాష్‌లెస్’ ట్రెండ్‌కి తగ్గట్టు వ్యవహరిస్తుండడం అందరినీ ఆకట్టుకుంటోంది. సాంప్రదాయాల్లో కూడా టెక్నాలజీకి చోటు.. క్యాష్‌లెస్ కట్నం అంటూ కొంత మంది చమత్కరించారు. పెళ్లిలో అక్షింతలు పట్టు... కట్నాలు స్కానర్‌కు కొట్టు.. అంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ వీడియో పోస్ట్ చేశారు. వధువు తండ్రి వినూత్న ఆలోచనకు నెటిజన్లు ఫిదా అయ్యారు. వైరల్ వీడియో కోసం క్లిక్ చేయండి..






