TG: అక్రెడిటేషన్ల జారీలో వీడియో జర్నలిస్టులకు అన్యాయం

by Gantepaka Srikanth |

వీడియో జర్నలిస్టులకు అక్రెడిటేషన్‌ల విషయంలో జరుగుతున్న అన్యాయంపై మీడియా అకాడమీ చైర్మన్, ఐఅండ్‌పీఆర్ కమిషనర్‌కు ఆ సంఘం ప్రెసిడెంట్ వనం నాగరాజు జనరల్ సెక్రెటరీ నండూరి హరీష్ ఆధ్వర్యంలో బుధవారం వినపతిపత్రం అందించారు.

TG: అక్రెడిటేషన్ల జారీలో వీడియో జర్నలిస్టులకు అన్యాయం
X

దిశ, వెబ్‌డెస్క్: వీడియో జర్నలిస్టులకు అక్రెడిటేషన్‌ల విషయంలో జరుగుతున్న అన్యాయంపై మీడియా అకాడమీ చైర్మన్, ఐఅండ్‌పీఆర్ కమిషనర్‌కు ఆ సంఘం ప్రెసిడెంట్ వనం నాగరాజు జనరల్ సెక్రెటరీ నండూరి హరీష్ ఆధ్వర్యంలో బుధవారం వినపతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వీడియో జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు జారీ చేసే సమయంలో చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలో వీడియో జర్నలిస్టుల సంఖ్య మరియు వారి పాత్ర ఎక్కువగా ఉంటుంది. అంత ముఖ్యమైన వీడియో జర్నలిస్టుల విషయంలో ప్రభుత్వం వైపు నుంచి తీరని అన్యాయం జరుగుతోంది. వీడియో జర్నలిస్టులు ఎలక్ట్రానిక్ మీడియాకు వెన్నెముక.. వారి లేనిదే ఎలక్ట్రానిక్ మీడియా లేదు.

పెద్ద ఉద్యమం చేద్దాం

ఇంతకుముందు వీడియో జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు 12, ఢిల్లీకి సంబంధించి రెండు, స్పోర్ట్స్ కోటా కింద మరొకటి, కల్చరల్‌కు సంబంధించి ఒకటి, సినిమాకు సంబంధించి ఒకటి, ఇలా మొత్తం కలిపి 17 కార్డులు ఇచ్చేవారు. ఇప్పుడు 9 కార్డులే ఇస్తున్నారు. వెబ్‌సైట్‌లో ఫ్రీలాన్స్ APPLY చేసే విషయంలో వీడియో జర్నలిస్టు అనే ఆప్షన్ లేకుండా చేశారు. ప్రస్తుతం ఫొటోగ్రాఫర్ & కరస్పాండెంట్ అనే ఆప్షన్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస రెడ్డిని, I&PR కమిషనర్ ప్రియాంకను కలిసి వీడియో జర్నలిస్టులకు అన్యాయంపై వారికి వివరించాము. దానికి వారు సానుకూలంగా స్పందించారు. దీనిపై ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోతే పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధం కావాలని తెలంగాణ స్టేట్ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ నేతలు పిలుపునిచ్చారు.

Next Story