- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిగాచి వద్ద బాధితుల ఆందోళన.. యాజమాన్యం, పోలీసులతో వాగ్వాదం
సిగాచి ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన (Sigachi Reactor Blast) ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: సిగాచి ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన (Sigachi Reactor Blast) ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అధికారిక లెక్కల ప్రకారం 36 మంది మరణించినట్లు ఉన్నా.. అంతకంటే ఎక్కువమందే చనిపోయారని తెలుస్తోంది. మరోవైపు తమవాళ్ల ఆచూకీ చెప్పాలంటూ సిగాచి పరిశ్రమ వద్ద బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి. గల్లంతైన తమ వారి గురించి యాజమాన్యం గాని, పోలీసులు గాని పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కంపెనీ సిబ్బంది, పోలీసులతో వాగ్వాదం జరిగింది. మృతుల సంఖ్య, ఆచూకీ తెలియనివారి వివరాలపై స్పష్టత రాకపోవడంతో బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వివరాలు చెప్పేందుకు జాప్యం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. మృతదేహాలను తమవారికి అప్పగించేందుకు డీఎన్ఏ టెస్టులు చేస్తున్నా.. తమ వారి వివరాలు ఎప్పుడు చెప్తారంటూ కన్నీరు పెడుతున్నారు. మృతుల వివరాలు వెల్లడించడంలో గందరగోళం, గల్లంతైనవారి వివరాలు ఇంకా తెలియకపోవడం, సహాయకచర్యల్లో జాప్యం నెలకొనడంతో తమ వాళ్లు ఉన్నారో లేరో చెప్పాలని ఆర్తనాదాలు పెడుతున్నారు.






