- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తాకట్టు.. మార్వాడీ కనికట్టు! జూబ్లీహిల్స్‌లో వ్యాపారి మోసం.. ‘మార్వాడీ గో బ్యాక్’ ఇష్యూ వేళ వెలుగులోకి ఘటన
తెలంగాణ వ్యాప్తంగా మార్వాడీ గో బ్యాక్ నిరసనల వేళ హైదరాబాద్‌లో ఓ మార్వాడీ వ్యాపారి మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ వ్యాప్తంగా మార్వాడీ గో బ్యాక్ (Marwadi Go Back) నిరసనల వేళ హైదరాబాద్‌లో ఓ మార్వాడీ వ్యాపారి మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. తాకట్టు పెట్టిన బంగారం, వెండితో వ్యాపారి ఉడాయించడంతో బాధితుడు ని జూబ్లీహిల్స్ (Jubilee Hills) పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకృష్ణానగర్‌లోని ముకేశ్ జైన్ పాన్ బ్రోకర్స్ వద్ద గోపాల్‌నాయక్ అనే వ్యక్తి రెండున్నర తులాల బంగారం, అర కేజీ వెండి ఆభరణాలు తాకట్టు పెట్టారు. మార్చిలో విడిపించుకొవడం కోసం వెళ్లగా లాకర్‌లో ఉన్నాయంటూ ముకేశ్ జైన్ బుకాయించాడు. అనంతరం నెల రోజుల తర్వాత వ్యాపారాన్ని తన బాబాయ్ బాబులాల్ జైన్‌కు అప్పగించి ముకేశ్ ఉడాయించినట్లు బాధితుడు ఆరోపించారు.
నెలలు గడిచినా ఇవ్వట్లేదు..
నగలను లాకర్ నుంచి తెచ్చిన తర్వాత ఇస్తానని అతని బాబాయ్ బాబూలాల్ జైన్ కాలయాపన చేశారని బాధితుడు చెప్పారు. నెలలు గడిచినా ఆభరణాలు బాబూలాల్, ముకేశ్ జైన్ వెనక్కి ఇవ్వక పోవడంతో గత జూన్ 24న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశానని గోపాల్ నాయక్ తెలిపారు. వ్యాపారి వద్ద సొమ్ము తాకట్టు పెట్టిన రసీదులు, అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు. అయితే, ఇప్పటి వరకు కేసు నమోదు చేయడం లేదంటూ గోపాల్‌నాయక్ ఆరోపణలు చేశారు. వెంటనే ముకేశ్ జైన్, అతని బాబాయ్ బాబూలాల్ జైన్ మీద కేసు నమోదు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.






