- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కడతావా.. చస్తావా?.. శ్రీరామ్ ఫైనాన్స్ టార్చర్ చేస్తోందని బాధితుడి ఆవేదన
శ్రీరామ్ ఫైనాన్స్ వేధింపులు భరించలేకపోతున్నామని ఓ బాధితుడు మీడియా ముందుకు వచ్చాడు. సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు.

దిశ, డైనమిక్ బ్యూరో:తమ ప్రమేయం లేకుండానే వాయిదాలు పెంచుతూ అధిక వడ్డీలతో (High Interest Rates) శ్రీరామ్ ఫైనాన్స్ (Sriram Finance) అమాయక ప్రజలను మోసం చేస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారు. శ్రీరామ్ ఫైనాన్స్ వేధింపులు తాళలేక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. ఈ మేరకు తాను తీసుకున్న లోన్ కు అదనంగా వడ్డీ చెల్లించాలని తనను తన కుటుంబాన్ని వేధిస్తున్నారని తాజాగా ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‍లో కృష్ణచైతన్య అనే బాధితుడు మీడియా ముందుకు వచ్చాడు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి శ్రీరామ్ ఫైనాన్స్ బ్రాంచ్ (Bhongir Sriram Finance) నుంచి తాను రూ. 60 లక్షలకు ట్రేడింగ్‍లోన్ తీసుకుంటే తనకు కేవలం రూ.57,47,666 మాత్రమే చెక్కు రూపంలో ఇచ్చి మిగతా మొత్తాన్ని ఆయా చార్జీల పేరుతో కట్ చేశారని ఆరోపించారు. తొలుత 26.46 శాతం వడ్డీకి 60 నెలల వాయిదాతో లోన్ మంజూరు చేసిన శ్రీరామ్ ఫైనాన్స్ ఉద్యోగులు.. ఆ తర్వాత తన ప్రమేయం లేకుండానే ఈఎంఐ వాయిదాలు 8 నెలలు ఒకసారి, 18 నెలలు మరోసారి పెంచారని, వడ్డీని కూడా 36 శాతానికి ఇష్టం వచ్చినట్లు పెంచుతూ వాటిని కట్టాలని వేధిస్తున్నారన్నారు.
కడుతావా? చస్తావా?:
లోన్ల విషయంలో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్న శ్రీరామ్ ఫైనాన్స్ ఉద్యోగులను ఇదేంటని ప్రస్నిస్తే సమాధానం చెప్పక పోగా లీగల్ టీమ్‍తో తాము చెప్పినంత వడ్డీ కట్టాలని లేదాంటే చచ్చిపోండి అనేలా బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము చనిపోతే ప్రాపర్టీనీ వేలం వేసి వసూలు చేసుకునేలా తమను బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. లోన్ మంజూరు సమయంలోనే ఇన్సూరెన్స్ తీయించి వాటి పత్రాలు కూడా తమకు ఇవ్వడం లేదన్నారు. నా లోన్ కు గ్యారెంటీగా ఉన్న వారిని టార్చర్ చేస్తున్నారని దాంతో తనకు గ్యారెంటీ ఇచ్చిన ఓ వ్యక్తి వీరి వేధింపులు భరించలేక అనారోగ్యానికి గురై చనిపోయాడని కృష్ణచైతన్య చెప్పారు. శ్రీరామ్ ఫైనాన్స్ లోన్ తీసుకున్న తనతో పాటు అనేక మంది మధ్యతరగతి ప్రజల పరిస్థితి ఇలాగే ఉందని ఈ వ్యవహారంపై తాను ఇప్పటికే ఆర్‍బీఐకి ఫిర్యాదు చేశానన్నారు. త్వరలోనే న్యాయం కోసం గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తన గోడు చెప్పుకునే ప్రయత్నం చేస్తానన్నారు. ప్రజావాణిలోనూ ఫిర్యాదు చేయబోతున్నట్లు చెప్పారు.






