రామంతపూర్‌లో కలకలం.. పాచిపోయిన తందూరి రోటీలు..! బాధితురాలి ఆరోపణలు

by Ramesh Naini |

రామంతపూర్‌లోని ఓ హోటల్ వేదికగా అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాచిపోయిన ఆహారాన్ని వడ్డించడమే కాకుండా, ప్రశ్నించినందుకు యజమాని దురుసుగా వ్యవహరించినట్లు బాధితులు ఆరోపించారు.

రామంతపూర్‌లో కలకలం.. పాచిపోయిన తందూరి రోటీలు..! బాధితురాలి ఆరోపణలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: నగరంలోని హోటళ్లలో నాణ్యత లేని ఆహారం వడ్డిస్తున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా రామంతపూర్‌లోని ఓ హోటల్ వేదికగా అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాచిపోయిన ఆహారాన్ని వడ్డించడమే కాకుండా, ప్రశ్నించినందుకు యజమాని దురుసుగా వ్యవహరించినట్లు బాధితులు ఆరోపించారు. వివరాల్లోకి వెళితే.. రోజా అనే కస్టమర్ సదరు హోటల్‌కు వెళ్లి తందూరి రోటీని ఆర్డర్ చేశారు. అయితే, ఆమెకు వడ్డించిన రోటీలు పాచిపోయి, దుర్వాసన వస్తుండటాన్ని గమనించిన ఆమె హోటల్ సిబ్బందిని నిలదీశారు.

బాధితురాలి ఆరోపణలు..

ఈ ఘటనపై బాధితురాలు రోజా ఆవేదన వ్యక్తం చేస్తూ పలు కీలక ఆరోపణలు చేశారు. పాచిపోయిన రోటీలను తిన్న కొద్దిసేపటికే తాను తీవ్ర అస్వస్థతకు గురైనట్లు ఆమె తెలిపారు. కేవలం రోటీలే కాకుండా, అక్కడ వడ్డించే బిర్యానీ కూడా నిల్వ ఉన్నదేనని ఆమె ఆరోపించారు. హోటల్ నిర్వాహకుల తీరుపై ఆమె నిలదీయడంతో అర్ధరాత్రి వరకు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఇలాంటి హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు (Food Safety Department) తక్షణమే స్పందించాలని బాధితురాలు డిమాండ్ చేశారు. హోటల్‌లో తనిఖీలు చేపట్టి, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Next Story