VH: ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ కాదు..

by Gantepaka Srikanth |

ఇప్పుడు కాకపోతే ఇంకా ఎప్పటికీ బీసీ రిజర్వేషన్ సాధ్యం కాదు.. ఢిల్లీ వెళ్లి అందరినీ కలిసి మనకి న్యాయం చేయాలని కోరదాం..

VH: ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ కాదు..
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇప్పుడు కాకపోతే ఇంకా ఎప్పటికీ బీసీ రిజర్వేషన్ సాధ్యం కాదు.. ఢిల్లీ వెళ్లి అందరినీ కలిసి మనకి న్యాయం చేయాలని కోరదాం.. రాష్ట్రంలో ఎన్ని ఉద్యమాలు చేసిన కేంద్రంలో ఎలాంటి మార్పు రావటం లేదని మాజీ ఎంపీ వీ.హన్మంత రావు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిజంగా బీసీలకు న్యాయం జరగాలంటే దేశ వ్యాప్తంగా ఉన్న సీఎంలు, ఎంపీలని కలవాలని, జూబ్లీ ఎన్నిక అనంతరం అన్ని రాష్ట్రాలు తిరిగి మన కులగణన గురించి చెప్పుతామన్నారు. 9 షెడ్యూల్‌లో బిల్ పాస్ అయితేనే బీసీలకు న్యాయం జరిగిననట్లు అని, మోడీకి సపోర్ట్ చేసే రాష్ట్రాల నాయకులను కలిసి వారి మద్దతును కోరాలని వీహెచ్​సూచించారు. ఇక్కడ ఎన్ని రోజులు కష్టపడ్డ పేపర్ లకి మాత్రమే పరిమితం అవుతుందన్నారు.

Next Story