VH: ముఖ్యమంత్రి గారు ఆ ఒక్క పథకం అమలు చేయండి.. అందరి ముందే కుండబద్దలు కొట్టిన వీహెచ్

by Prasad Jukanti |   (  Updated:2025-10-19 11:39:41  IST  )

బీఆర్ఎస్, బీజేపీలు విమర్శిస్తున్నాయని వీహెచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

VH: ముఖ్యమంత్రి గారు ఆ ఒక్క పథకం అమలు చేయండి.. అందరి ముందే కుండబద్దలు కొట్టిన వీహెచ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (V.Hanumantha Rao) గురించి తెలియనివారంటూ ఉండరు. స్థలం ఏదైనా సందర్భం మరేదైనా కానీ తనదైన డైలాగులతో అందరిని ఆకట్టుకోవడం వీహెచ్ స్టైల్. అలాంటి హనుమంతరావు తాజాగా స్టేజీపై రేవంత్ రెడ్డి (Revanth Reddy) ముందే కుండబద్దలు కొట్టారు. ఆదివారం చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సభ (Rajiv Gandhi Sadbhavana Yatra) నిర్వహించారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ స్టేజీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులంతా ఉండగానే ప్రభుత్వం హామీ ఇచ్చి ఇంకా అమలు చేయని మహిళలకు నెలకు రూ. 2500 పథకం గురించి ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని సన్నబియ్యం హామీ కూడా నెరవేరుస్తోందన్నారు. అయినా ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ఆరు గ్యారెంటీలు అమలు కావడం లేదని విమర్శిస్తోందన్నారు. అయితే మేము ఇచ్చిన హామీలన్ని అమలు అవుతున్నాయని కేవలం మహిళకు రూ.2500 మాత్రమే అమలు కాలేదు. ముఖ్యమంత్రి గారు.. ఈ ఒక్క పథకం అమలు చేస్తే మనం ఇచ్చిన హామీలన్నీ అమలు చేసినట్లే అంటూ స్టేజీపై ఉన్న ముఖ్యమంత్రిని చూస్తూ చెప్పారు. తాను నిజం చెప్తున్నానని మహిళలంతా ఈ పథకం గురించి అడుగుతున్నారని, బోనాలు పండగకు వెళ్తే బోనాలు ఎత్తుకున్న మహిళలు సైతం మాకిచ్చిన హామీ ఏమైందంటూ మమ్మల్ని అడుగుతున్నారని చెప్పారు. ఈ వ్యాఖ్యలతో అంతా స్టేజీపై అంతా నవ్వులు పూశాయి.

Next Story