- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
VH: కేటీఆర్ దమ్ముంటే ఢిల్లీలో మాట్లాడు.. మాజీ ఎంపీ వీహెచ్ హాట్ కామెంట్స్
కేటీఆర్ కు దమ్ముంటే ఢిల్లీలో మాట్లాడాలని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావు(Congress Senior Leader V.Hanumanth Rao) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: కేటీఆర్ కు దమ్ముంటే ఢిల్లీలో మాట్లాడాలని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావు(Congress Senior Leader V.Hanumanth Rao) అన్నారు. గాంధీ భవన్(Gandhi bhavan) లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఆరు గ్యారెంటీలపై(Six Guarentees) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆరు గ్యారంటీల గురించి ఢిల్లీలో మాట్లాడిండారని, కేటీఆర్ కు దమ్ముంటే ఢిల్లీలో మాట్లాడాలని సవాల్ విసిరారు. కేటీఆర్ ధర్నా చేస్తా అని మాట్లాడుతున్నాడని, ఆయన శాంతి యుతంగా ధర్నా చేస్తే ఆరోగ్యం బాగుంటుందని ఎద్దేవా చేస్తూ మాట్లాడారు.
అలాగే పవర్ లో ఉన్నప్పుడు ధర్నా చౌక్ గుర్తు రాలేదా అని, తాము కాపాడిన ధర్నా చౌక్ లో కేటీఆర్ రోజు ధర్నా చేసినా మాకు అభ్యంతరం లేదని చెప్పారు. ఇక అమిత్ షా నిండు రాజ్య సభలో అంబేద్కర్ ను అవమానిస్తే.. ఇప్పుడు భారత దేశాన్ని ఆర్ఎస్ఎస్ చీప్ మోహన్ భగవత్ అవమానిస్తున్నాడని ఆరోపించారు. 1947 లో స్వాతంత్ర్య వస్తే.. రామ మందిరం అయోధ్యలో కట్టినప్పుడు నిజమైన స్వాతంత్ర్య వచ్చిందని మోహన్ భగవత్ అంటున్నాడని, భగత్ సింగ్, వల్లభాయ్ పటేల్, గాంధీ లాంటి వారు స్వాతంత్ర్యాన్ని తెస్తే, బీజేపీ వాళ్ళు చరిత్రను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ఇక వీళ్లలో ఇంకా మార్పు రాలేదని, వాళ్ళు తప్పు చేస్తే రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నాడని అన్నారు. భారత దేశాన్ని అవమనిస్తారా అని రాహుల్ గాంధీ అంటే ఆయనను వ్యాఖ్యలను కూడా వక్రీకరిస్తున్నారని వీహెచ్ అన్నారు.






