- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీ సంక్షేమ, అభివృద్ధి శాఖ సలహాదారుగా బాధ్యతలను స్వీకరించిన వీహెచ్
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ, అభివృద్ధి శాఖ సలహాదారుగా బాధ్యతలను స్వీకరించారు. తెలంగాణ సచివాలయంలో గురువారం ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు.

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ, అభివృద్ధి శాఖ సలహాదారుగా బాధ్యతలను స్వీకరించారు. తెలంగాణ సచివాలయంలో గురువారం ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వీహెచ్ కి మాజీమంత్రి జానారెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి, టీపీసీసీ ఓబీసీ చైర్మన్, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, రాజ్ ఠాకూర్ లు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర చైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత వి.హన్మంతరావు అని, ఆయన బలహీన వర్గాలకు న్యాయం చేయలని ముందుకు వెళ్తున్న సందర్భంలో వారి సలహాలు సూచనలు స్వీకరిస్తామని, బలహీన వర్గాల హక్కుల కోసం అందరం కలిసి పని చేస్తామన్నారు.
రజక కో ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన దాసరిరాజు అజయ్ కుమార్
రాష్ట్ర రజక కో ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గా దాసరిరాజు అజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. గురువారం మాసబ్ ట్యాంక్ డీఎస్ఎస్ భవన్ లో అజయ్ కుమార్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భొంగా ఆయనకు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, పలువురు రాజకీయ ప్రముఖులు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రజక వృత్తి మారుతున్న కాలానికి అనుగుణంగా ఉండాలని, మొదటి దశలో 119 నియోజకవర్గాల్లో అధునాతన మోడర్న్ డ్రైక్లినింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. గత ప్రభుత్వం రజకులకు ప్రారంభించిన 250 యూనిట్ల ఉచిత విద్యుత్ కు ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగిస్తున్నామని, తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రజక వృత్తి అభివృద్ధి చెందుతూ విద్యా, ఉపాధి అవకాశాలు మెరుగుపడేల చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నియోజకవర్గానికి ఒకటి ఆధునిక దోభిఘాట్ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.






