- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG-AP: కృష్ణా జలాల వివాదం.. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కీలక నిర్ణయం
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలవివాదాల విచారణపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కీలక తీర్పు వెలువరించింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ - ఆంధ్రప్రదేశ్(Telangana - Andhra Pradesh) మధ్య కృష్ణా జలవివాదాల(Krishna Water Dispute) విచారణపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్(Brijesh Kumar Tribunal) కీలక తీర్పు వెలువరించింది. అదనపు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌పై మొదట విచారణ చేయాలని ట్రైబ్యునల్ నిర్ణయం తీసుకుంది. విభజన చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం మొదట వాదనలు వింటామని చెప్పింది. 811 టీఎంసీల్లో రెండు రాష్ట్రాల వాటా తేల్చడం ముఖ్యమని అభిప్రాయపడింది. వచ్చే ఫిబ్రవరి 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు వాదనలు వింటామని హామీ ఇచ్చింది. ప్రాజెక్టుల వారీ కేటాయింపులపై వాదనలు తర్వాత వింటామని స్పష్టం చేసింది.
ఆ తర్వాతే 89వ సెక్షన్ ప్రకారం ప్రాజెక్టుల వారీగా కేటాయింపుపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. కాగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వాటా తేల్చే పనిని కృష్ణా ట్రిబ్యునల్-2కు కేంద్రం అప్పగించిన విషయం తెలిసిందే. కృష్ణా నదీ జలాల వినియోగం, పంపిణీ, నియంత్రణపై రెండు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం కోసం ఈ ట్రిబ్యునల్ కొత్త మార్గాలను అన్వేషించింది.






