- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gaddar : గద్దర్ పై బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించిన వెన్నెల
పద్మ అవార్డు ఎంపిక నేపథ్యంలో గద్దర్(Gaddar)పై కేంద్ర మంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) చేసిన వ్యాఖ్యలపై గద్దర్ కుమార్తె(Gaddar Daughter), తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్ పర్సన్(Telangana Cultural Saradhi Chairperson)గుమ్మడి వి. వెన్నెల(Gummadi V. Vennela) తీవ్రంగా ఖండించారు.

దిశ, వెబ్ డెస్క్ : పద్మ అవార్డు ఎంపిక నేపథ్యంలో గద్దర్(Gaddar)పై కేంద్ర మంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) చేసిన వ్యాఖ్యలపై గద్దర్ కుమార్తె(Gaddar Daughter), తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్ పర్సన్(Telangana Cultural Saradhi Chairperson)గుమ్మడి వి. వెన్నెల(Gummadi V. Vennela) తీవ్రంగా ఖండించారు. గద్దర్ పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను యావత్ భారత దేశ కళాకారుల తరుపున, తెలంగాణ సాంస్కృతిక సారధి తరుపున ఖండిస్తున్నట్లుగా చెప్పారు. గద్దర్ పదవుల కోసమో, డబ్బు కోసమో, అవార్డుల కోసమో తన జీవితాన్ని ఫణంగా పెట్టి పని చేయలేదని..తెలంగాణ కోసం, పీడిత, పేద ప్రజల కోసం, అణగారిన వర్గాలు, మహిళల కోసం గద్దర్ పోరాడారని గుర్తు చేశారు.
శరీరంలో బుల్లెట్లు ఉంచుకొని కూడా ప్రజల కోసం కొట్లాడిన వ్యక్తి గద్దర్ అని వెన్నెల పేర్కొన్నారు. మీరు తక్కువ చేసి మాట్లాడినంత మాత్రాన గద్దర్ స్థాయి తగ్గదన్నారు. గద్దర్ పై విమర్శలు చేస్తే సూర్యుడి మీద ఉమ్మెయడం వంటిదేనన్నారు. గద్దర్ ఓ చారిత్రాత్మక వ్యక్తి..యుగ పురుషుడని కొనియాడారు. ప్రజల పాటగా ఆయన చిరస్మరణీయుడని..ఆయన స్థాయిని అవార్డులు నిర్ణయించలేవన్నారు.
అసలు పద్మ అవార్డులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమా ? లేక బీజేపీ పార్టీనా ? అని వెన్నెల ప్రశ్నించారు. వివిధ రంగాల్లో దేశానికి సేవలందించిన ప్రముఖులను గుర్తించి ఇచ్చేందుకు తగిన మార్గదర్శకాలు ఉన్నాయని, అలాంటప్పుడు బండి సంజయ్ తమ పార్టీ కార్యకర్తలను చంపినోళ్లకు అవార్డులు ఎలా ఇస్తారంటూ మాట్లాడం ఎంతవరకు సమంజమని ప్రశ్నించారు. పద్మ అవార్డులు అధికార పార్టీలు ఎంపిక చేసిన వారికే ఇస్తారా లేక సమాజానికి, దేశానికి విశిష్ట సేవలందించిన సామాన్యులకు కూడా ఇస్తారా అన్నదానిపై కేంద్రం ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉందన్నారు.






