- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మావోయిస్టుల వరుస లొంగుబాట్లు.. వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Venkaiah Naidu) కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాపై నియంత్రణ అవసరం అని అభిప్రాయపడ్డారు.

దిశ, వెబ్‌డెస్క్: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Venkaiah Naidu) కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాపై నియంత్రణ అవసరం అని అభిప్రాయపడ్డారు. అంత వరకూ వచ్చాక ఈసీపై ఆరోపణలు చేయడం కంటే ముందే.. రాజకీయ పార్టీలు ఓటర్ లిస్టును వెరిఫై చేసుకోవడం బెటర్ అని సూచించారు. దాంతో పాటు మావోయిస్టు(Maoist Party)లపై కేంద్రం తీసుకుంటున్న చర్యలపై ప్రజలంతా సంతోషంగా ఉన్నారని అన్నారు. లొంగుబాటులు మంచి పరిణామమని తెలిపారు. కమ్యూనిస్టుల మధ్యే ఎన్నో విభేదాలు ఉన్నాయని.. అలాంటిటప్పుడు వాళ్లు చేసే ఉద్యమాలు, పోరాటాలు ప్రజలకు ఎలా మేలు చేస్తాయని అన్నారు. బుల్లెట్ కంటే.. బ్యాలెట్ పవర్ ఫుల్ అని చెప్పారు. కాగా, ఇటీవలి కాలంలో మావోయిస్టు పార్టీ అగ్రనేతలంతా వరుసగా లొంగిపోతున్న విషయం తెలిసిందే. ఒకరి తర్వాత ఒకరు అందరూ జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. ఇప్పటివరకు దాదాపు 300 మావోయిస్టులకు పైగానే లొంగిపోయారు. ఈ తరుణంలో మావోయిస్టు పార్టీపై వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.






