- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Venkaiah Naidu: ఫొటో జర్నలిజం ప్రజాస్వామ్యానికి కళ్లు
జర్నలిజం ఒక మహావృక్షమైతే అందులో ఫొటో జర్నలిస్ట్‌లు ప్రాణం లాంటి వారని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: జర్నలిజం ఒక మహావృక్షమైతే అందులో ఫొటో జర్నలిస్ట్‌లు ప్రాణం లాంటి వారని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఫొటో జర్నలిజం ప్రజాస్వామ్యానికి కళ్ల లాంటిదని, దీనిని అందరూ కాపాడుకోవాలని సూచించారు. ఆదివారం రాష్ట్ర ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 23వ ఉత్తమ ఫొటో జర్న లిస్ట్- 2025 అవార్డుల ప్రధానోత్సవ’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రిపోర్టర్ కలం పెడితే, ఫొటో జర్నలిస్టు కళను బందిస్తారన్నారు. తాను 1964లో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నప్పటి నుంచి ఫొటో జర్నలిస్టులతో అనుబంధం ఉందన్నారు. ప్రపంచంలో భాషాలు ఎన్నైనా ఉండొచ్చు కానీ, ఏ భాషతో సంబంధం లేకుండా ఉండేది కేవలం ఫోటోగ్రఫీ మాత్రమేనని గుర్తు చేశారు. వంద మాటల పెట్టు ఒక ఫొటో రూపం అని అభివర్ణించారు.
ఒక వ్యాసం చెప్పలేని భావాన్ని ఒక ఫొటో చెబుతుందన్నారు. అనంతరం మీడియా అకాడమీ చైర్మన్శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. గతంతో పొల్చితే ప్రస్తుత జర్నలిజంలో చాలా మార్పులు వచ్చాయన్నారు. ప్రస్తుత ఏఐ టెక్నాలజీ అన్ని రంగాలకు చాలా ఉపయోగకరంగా మారిందని, ముఖ్యంగా వైద్య రంగంలో చాలా మార్పులు తీసుకొచ్చిందని తెలిపారు. ఫొటో జర్నలిస్ట్ కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని, ప్రస్తుత ఏఐ రంగంలో ఎలా ముందుకెళ్లాలో చర్చించుకుందామని సూచించారు. ఈకార్యక్రమంలో ఐజెయు స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఐ.ఎన్.టి.యు.సి తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షులు మొగుళ్ళ రాజిరెడ్డి, ఐజెయు జాతీయ ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి, ,టియుడబ్లుజె అధ్యక్షులు కె.విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి రాం నారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు ఫొటోగ్రఫీలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఫొటోజర్నలిస్టుల ప్రథమ బహుమతిని ఇందు శ్రీనివాస్(ఈనాడు, నిజామాబాద్), రెండవ బహుమతి ఎ.క్రిష్ణ (హాన్స్ ఇండియా, హైదరాబాద్), తృతీయ బహుమతి జి.బాలస్వామి (సాక్షి,హైదరాబాద్)లకు బహుమతులు అందజేశారు. మరో పది మంది ఫొటో జర్నలిస్టులు ఎన్.రాజేష్ (సాక్షి,హైదరాబాద్),జి.శ్రీనివాస్ (నమస్తే తెలంగాణ, హైదరాబాద్), ఎ.జాన్ (సాక్షి,హైదరాబాద్),ఆర్.రాజు(సాక్షి,ఖమ్మం),పి.వాసప్రసాద్(సాక్షి,వరంగల్), ఎం.శ్రీనివాస్(ది హన్స్ ఇండియా,నల్లగొండ), జి.వేణుగోపాల్(సాక్షి,జనగాం),ఎం.అనిల్ కుమార్ (ఆంధజ్యోతి, హైదరాబాద్), వీరగోని.రాజనికాంత్ గౌడ్(నమస్తే తెలంగాణ,హైదరాబాద్), ఎ.జ్వల కోటేశ్వర్ రావు (ఆంద్రజ్యోతి, హైదరాబాద్), అందజేశారు.






