నడిరోడ్డుపై 5 గంటలపాటు నిలిచిపోయిన కావేరీ ట్రావెల్స్ బస్సు.. పట్టించుకోని యాజమాన్యం

by Naga Rani Yarlagadda |

నడిరోడ్డుపై సుమారు 5 గంటలపాటు కావేరీ ట్రావెల్స్ బస్సు నిలిచిపోయింది. దీంతో 36 మంది ప్రయాణికులు తెల్లవార్లు ఇబ్బందులు పడ్డారు.

నడిరోడ్డుపై 5 గంటలపాటు నిలిచిపోయిన కావేరీ ట్రావెల్స్ బస్సు.. పట్టించుకోని యాజమాన్యం
X

దిశ, వెబ్‌డెస్క్: అక్టోబర్ నెలలో జరిగిన కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 19 మంది సజీవదహనం అయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం అనేకమంది కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. తాజాగా కావేరీ ట్రావెల్స్ కు చెందిన మరో బస్సు ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేసింది. తిరుపతి నుంచి హైదరాబాద్ కు 36 మంది ప్రయాణికులతో బయల్దేరిన వీ కావేరీ ట్రావెల్స్ బస్సు శనివారం అర్థరాత్రి 2.30 గంటల సమయంలో సంతమాగులూరు మండలం ఏల్చూరు వద్ద సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 5 గంటలపాటు బస్సు రోడ్డుపై నిలిచిపోయింది. ఉన్నట్లుండి బస్సు ఆగిపోవడంతో ప్రయాణికులు కంగారుపడ్డారు. డ్రైవర్లను ఏమైందని ప్రశ్నించగా.. చిన్న సమస్యేనని కాసేపట్లే బయల్దేరుతుందని చెప్పుకొచ్చారు. యాజమాన్యానికి కాల్ చేసి విషయం చెప్పారు.

గంటల సమయం గడుస్తున్నా బస్సు కదలకపోవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. తెల్లవారినా యాజమాన్యం పట్టించుకోకపోవడంతో మహిళలు, చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చేసేదిలేక ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. అక్కడికి చేరుకున్న పోలీసులు ట్రావెల్స్ యాజమాన్యంతో మాట్లాడి వేర బస్సుల్లో ప్రయాణికులను పంపించారు. టికెట్ ఛార్జీలను తిరిగి ఇప్పిస్తామని పోలీసులు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Next Story