- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంకా జ్ఞానోదయం కాలేదా?.. జగదీష్ రెడ్డికి వేముల వీరేశం పరోక్ష కౌంటర్
కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నియామకాన్ని బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి తప్పుబడుతూనే ఉందని, తమ అవినీతి ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో కోర్టును ఆశ్రయించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అని ప్రభుత్వ విప్, వేముల వీరేశం ఆరోపించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నియామకాన్ని బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి తప్పుబడుతూనే ఉందని, తమ అవినీతి ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో కోర్టును ఆశ్రయించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అని ప్రభుత్వ విప్, వేముల వీరేశం ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని అంశాలపై కోర్టు స్టే తెచ్చుకుని ఇప్పుడు కేసు మొత్తం గెలిచినట్లుగా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని, పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కొన్ని అంశాలపై చర్యలు తీసుకోవద్దని మాత్రమే హైకోర్టు సూచించిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన నాణ్యత, నిర్మాణ లోపాల కారణంగా ప్రాజెక్టుకు భారీ నష్టం జరిగిందని, వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయ్యిందని వేముల వీరేశం విమర్శించారు. ఈ పరిస్థితికి బాధ్యత వహించాల్సింది వారే కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకోవడం అంటే అసలు దొంగలు ఎవరో తెలంగాణ ప్రజలు గమనించాలన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపేందుకు అవసరమైతే సీబీఐ దర్యాప్తు కూడా చేపట్టాలని ఈ ప్రభుత్వం భావిస్తోందని, అవినీతికి ఎవరు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని వేముల వీరేశం అన్నారు. పదేళ్లపాటు అధికారంలో ఉండి దోచుకుని దాచుకున్న బీఆర్ఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా నాయకులు ఇప్పుడు అహంకారంతో మాట్లాడడం సమంజసంగా లేదని, మున్సిపల్ ఎన్నికల్లో సూర్యాపేట ప్రజలు ఇచ్చిన తీర్పుతోనైనా ఆయనకు ఇంకా జ్ఞానోదయం అయినట్లుగా లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా వేముల వీరేశం ఆరోపణలు గుప్పించారు. కాళేశ్వరం అవినీతిపై పూర్తి నిజాలు వెలుగులోకి వచ్చి, బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు తమ ప్రభుత్వ పోరాటం కొనసాగుతుందన్నారు.






