ధాన్యం కొనుగోళ్ల పై కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డివి ప‌చ్చి అబ‌ద్దాలు

by velandi.Saikiran |   (  Updated:2026-05-31 14:15:53  IST  )

కిష‌న్ రెడ్డి ధాన్యం కొనుగోళ్ల పైన ప‌చ్చి అబ‌ద్దాలు మాట్లాడుతున్నారని, ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా జ‌రుగుతోందని వేముల వీరేశం తెలిపారు.

ధాన్యం కొనుగోళ్ల పై కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డివి ప‌చ్చి అబ‌ద్దాలు
X

ధాన్యం కొనుగోళ్ల పై కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డివి ప‌చ్చి అబ‌ద్దాలు

తెలంగాణ ద్రోహులుగా బీజేపీ మంత్రులు త‌యార‌య్యారు..

పంజాబ్, హ‌ర్యానాల్లో మొత్తం ధాన్యం కేంద్రం కొనుగోలు చేస్తోంది

తెలంగాణలో 30శాతం మాత్రమే కొనుగోలు చేస్తామంటున్నారు

: ప్రభుత్వ విప్, వేముల వీరేశం

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ధాన్యం కొనుగోళ్ల పైన ప‌చ్చి అబ‌ద్దాలు మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా జ‌రుగుతోందని ప్రభుత్వ విప్, వేముల వీరేశం తెలిపారు. కిషన్ రెడ్డి సోయి లేని, అర్థం లేని మాట‌లు మాట్లాడుతున్నారని, తెలంగాణ ప్రజ‌ల‌ను కిష‌న్ రెడ్డి చూసి న‌వ్వుకుంటున్నారు..అస‌హ్యించుకుంటున్నారని వేముల వీరేశం అన్నారు. ఆదివారం సీఎల్పీలోని మీడియా సెంటర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ నాయ‌కులు రాజ‌కీయ యాత్ర చేశారని, ధాన్యం కొంటామ‌ని, లారీలు పంపిస్తామ‌ని, హమాలీలు తెస్తామ‌ని రైతుల‌కు బీజేపీ నాయ‌కులు భ‌రోసా ఇచ్చారా? అని ప్రశ్నించారు. పంజాబ్, హ‌ర్యానా రాష్ట్రాల్లో మొత్తం ధాన్యం కేంద్రం కొనుగోలు చేస్తోందని, తెలంగాణలో మాత్రం ముప్పై శాతం మాత్రమే కొనుగోలు చేస్తామ‌ని అంటున్నారని వేముల వీరేశం విమర్శించారు. పంజాబ్ కు ఒక నీతి, తెలంగాణ‌కు మ‌రో నీతా? తెలంగాణ లో పండిన ధాన్యాన్ని కూడా మొత్తం కొనిపించేలా కేంద్రం పైన ఒత్తిడి తెస్తామ‌ని బీజేపీ మంత్రులు చెప్తే ప్రజ‌లు క్షమించేవారన్నారు. తెలంగాణ ద్రోహులుగా బీజేపీ మంత్రులు త‌యార‌య్యారని, బీఆర్ఎస్ ఎజెంట్లుగా మారి రాష్ట్ర ప్రభుత్వం పైన విషం చిమ్ముతున్నారని వేముల వీరేశం మండిపడ్డారు.

బీజేపీకి రాజ‌కీయ ప్రయోజ‌నాలే త‌ప్ప రైతుల ప్రయోజ‌నాలు ప‌ట్టవని, తన నియోజ‌క‌వ‌ర్గానికి కిష‌న్ రెడ్డి వ‌స్తే కొనుగోలు సెంట‌ర్లు ఎలా ఉన్నాయో చూపిస్తామన్నారు. రైతులు సీఎం రేవంత్ రెడ్డికి నీరాజ‌నాలు పలుకుతున్నారని, రికార్డు స్థాయి లో దిగుబ‌డి వ‌చ్చింది..ప్రణాళికా ప్రకారం కొనుగోళ్లు వేగంగా చేస్తున్నామని వేముల వీరేశం చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంద‌రు మిల్లర్లు కుమ్మక్కై అక్రమాల‌కు పాల్పడ్డారని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్పడిన మిల్లర్ల పైన కేసులు పెట్టామని, ఆస్తులు రిక‌వ‌రీ చేశామన్నారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర రైతుల‌కు ఏం ఉప‌యోగం లేదని, బీజేపీతో ప్రజ‌ల‌కు అవ‌స‌రం లేదు..ఢిల్లీలో కేంద్ర మంత్రులు మోహం చెల్లడం లేదు.. మోదీ, అమిత్ షా బీజేపీ నేత‌లను ప‌ట్టించుకోవ‌డం లేదని వేముల వీరేశం విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ గ‌తంలో కేంద్రంలోని బీజేపీకి మ‌ద్దతు ప‌లికిందని, తోడు దొంగ‌ల్లా బీజేపీ, బీఆర్ఎస్ నాయ‌కులు తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ రైతుల‌ను బీజేపీ నాయ‌కుల మాట‌ల‌ను న‌మ్మరని, కేంద్రం చూపిస్తున్న వివ‌క్షను తెలంగాణ రైతులు ప్రశ్నిస్తున్నారని వేముల వీరేశం అన్నారు.

Next Story