మగధీర డైలాగులు వద్దు రేవంత్‌రెడ్డి: మాజీ మంత్రి వేముల

by Ajay Maddhiboyina |

‘రేవంత్‌రెడ్డి.. మగధీర సినిమాలో డైలాగ్‌లు వద్దు. 100కి ఒక్కటి తగ్గకుండ ఎమ్మెల్యేలను గెలిపిస్తా.. నేనే సీఎంగా ఉంటా అని ఊహాలోకంలో విహరిస్తున్నారు.

మగధీర డైలాగులు వద్దు రేవంత్‌రెడ్డి: మాజీ మంత్రి వేముల
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘రేవంత్‌రెడ్డి.. మగధీర సినిమాలో డైలాగ్‌లు వద్దు. 100కి ఒక్కటి తగ్గకుండ ఎమ్మెల్యేలను గెలిపిస్తా.. నేనే సీఎంగా ఉంటా అని ఊహాలోకంలో విహరిస్తున్నారు. మీ పాలన నుండి రాష్ట్రానికి మోక్షం ఎప్పుడా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. మీరెన్ని కుప్పిగంతులు వేసినా రానున్న ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని లాగిపెట్టి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిందని ఖర్గేతో అందమైన అబద్ధాలు మాట్లాడించారని పేర్కొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ రాసి ఇచ్చిన పేపర్ చదవటం కాదు ఖర్గే జీ.. క్షేత్ర స్థాయిలో తిరగాలని సూచించారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలేమనుకుంటున్నారో నిజాలు తెలుస్తాయని పేర్కొన్నారు. ఢిల్లీ కాంగ్రెస్ డబ్బు మూటలు పంపమని చెబుతున్నదని.. రాష్ట్ర కాంగ్రెస్ అది చేసి చూపెడుతున్నదని ఆరోపించారు.

ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయడం లేదని ఆరోపించారు. కేసీఆర్ పెట్టిన క్యాంటీన్‌లకు పేర్లు మార్చడం.. కేసీఆర్ నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్ష నిర్వహించి రిజల్ట్ ఇచ్చిన ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేసి తామే 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని అనడం.. గత ప్రభుత్వ హయాంలో కట్టించిన ఫ్లై ఓవర్లను ప్రారంభించి గొప్పగా చెప్పుకోవడం.. మందికి పుట్టిన బిడ్డను తమ బిడ్డ అని ముద్దాడినట్టు ఉంది రేవంత్ రెడ్డి తీరు అని పేర్కొన్నారు. నిజంగా ఉద్యోగాలు ఇచ్చి ఉంటే నిరుద్యోగులు నిరసనకు ఎందుకు పిలుపునిచ్చారని ప్రశ్నించారు. ప్రజా పాలన అంటూనే వారిని ఎందుకు అరెస్ట్ చేశారని నిలదీశారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులను రెచ్చగోట్టినట్టు కాదని.. ఒకసారి అశోక్‌నగర్ వెళ్లి నిరుద్యోగులతో మాట్లాడి వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. వేదిక ఏదైనా కేసీఆర్ మీద పడి ఏడవటం తప్ప రేవంత్‌రెడ్డికి పాలన చేతకాదని పేర్కొన్నారు.

Next Story