- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుంగింది బ్యారేజీ కాదు.. ఉత్తమ్ బ్రెయిన్
కుంగింది బ్యారేజీ కాదని.. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బ్రెయిన్ అని మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఒక ప్రకటన

కుంగింది బ్యారేజీ కాదు.. ఉత్తమ్ బ్రెయిన్
- బ్యారేజీకి, మోటార్లు ఆన్ చేయడానికి ఏమైనా సంబంధం ఉన్నదా
- మరోసారి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు
- మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: కుంగింది బ్యారేజీ కాదని.. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బ్రెయిన్ అని మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అసలు బ్యారేజీకి, మోటార్లు ఆన్ చేయడానికి ఏమైనా సంబంధం ఉన్నదా అని ప్రశ్నించారు. నీటిపారుదల శాఖ మంత్రిగా అజ్ఞానాన్ని మరోసారి బయట పెట్టుకున్నారని పేర్కొన్నారు. కన్నెపల్లి పంప్ హౌజ్ మినిమం డ్రా లెవల్ 93.5 మీటర్లు అయితే.. 96 మీటర్ల ఎత్తున నీళ్లు ప్రవహిస్తున్నాయని.. కన్నెపల్లి పంపు హౌస్ మోటార్లు ఆన్ చేసి నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేశామని, అది చేయకుండా మళ్లీ అవే బురద రాజకీయాలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. గోదావరి నీళ్లను రైతుల పొలాలకు మళ్లించాలని తాము అడుగుతుంటే, సాకులు చెబుతూ నీళ్లు కిందకు వదులుతున్నారని ఆరోపించారు.
283 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన రికార్డు ఎలా సాధ్యమైందని నిలదీశారు. కాంగ్రెస్ 19 నెలల పాలనలో ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా? ఒక్క చెక్ డ్యాం అయినా నిర్మించారా? ఒక్క చెరువు పూడిక తీశారా? కొత్తగా ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ సాధించిన ఘనతను, కాంగ్రెస్ ఘనతగా చెప్పుకుంటూ తిరగటం తప్ప చేసిందేమీ లేదని పేర్కొన్నారు. మే 30న శ్రీశైలానికి వరద వస్తే ఇప్పటివరకు కల్వకుర్తి మోటార్లు ఎందుకు ఆన్ చేయలేదని ప్రశ్నించారు. వరద రూపంలో నీళ్లు కిందకు తరలివెళ్తుంటే జూలై, ఆగస్టు అంటూ ముహూర్తాల కోసం ఎందుకు చూస్తున్నారని పేర్కొన్నారు. మొద్దు నిద్ర వీడి, మోటార్లు ఆన్ చేయాలని.. లేదంటే వచ్చే కరువుకు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.






