- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CPM: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై తమ్మినేని కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తుపై తమ్మినేని కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర రాజకీయం స్థానిక సంస్థల ఎన్నికల చుట్టూ తిరుగుతోంది. ఈఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నేపథ్యంలో త్వరోలనే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రిజర్వేషన్ల అంశం కొలిక్కి వస్తే ఏ క్షణమైనా నోటిఫికేషన్ విడుదల చేసి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు జరిగితే పై చేయి ఎవరిది? అనేది ఉత్కంటగా మారింది. ఈ నేపథ్యంలో ప్రత్యర్థులను చిత్తుచేసేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాలు రచించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పొలిటికల్ గ్రౌండ్ లో ఎవరు ఎవరికి సహకారం అందించబోతున్నారనేది ఉత్కంఠగా మారిన వేళ సీపీఎం (CPM) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadram) కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయబోతున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటించిన తమ్మినేని ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలం అయిందని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ రాష్ట్రాలలోని కులాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తోందన్నారు. బిహార్ లో ఓటర్ జాబితా నుంచి ఓటర్లను తొలగించడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు.






