- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vedire Sriram: మీ ఒప్పందమే మరణశాసనం.. కేసీఆర్‍కు కేంద్ర జలశక్తి మాజీ సలహాదారు కౌంటర్
నదులకు నడక నేర్పిన కేసీఆర్ కు ఈ విషయం తెలియకపోవడం వింతగా ఉందని కేంద్ర జలశక్తి మాజీ సలహాదారు కౌంటర్ ఇచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కృష్ణా జలాల పంపకాలు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ పై ఇటీవల బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ వ్యాఖ్యలను తెలంగాణ మంత్రులు ఖండించారు. తాజాగా కేంద్ర జలశక్తి మాజీ సలహాదారు, మహారాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వెదిరే శ్రీరామ్ (Vedire Sriram) కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కృష్ణా జలాలపై (Krishna Water Dispute) కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన ఇవాళ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కృష్ణా నీటి పంపకాల విషయంలో నాటు కేసీఆర్ చేసుకున్న 299 టీఎంసీల అగ్రిమెంటే తెలంగాణకు మరణ శాసనంగా మారిందని వెదిరే శ్రీరామ్ ఆరోపించారు. గతంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో 811 టీఎంసీలలో కేసీఆర్ 299 టీఎంసీలకు మాత్రమే అగ్రిమెంట్ చేసుకున్నారని దీని వెనుక ఉన్న ప్రయోజనాలు కేసీఆర్ కే తెలియాలన్నారు. కేసీఆర్ నిర్ణయాలే కృష్ణా జలాల్లో పాలమూరుకు తీవ్ర అన్యాయానికి కారణం అయ్యాయని ధ్వజమెత్తారు.
299 టీఎంసీల నీటిని తెచ్చుకున్నప్పటికీ ఆ నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారని ఎన్నికల సమయంలో హడావిడి చేయడం తప్పితే ఏ ఒక్క ఎకరానికి కూడా నీరు చేరలేదన్నారు. రెండు రాష్ట్రాల నీటి కేటాయింపులపై కొత్తగా ట్రిబ్యునల్ వేయడం కేంద్ర ప్రభుత్వం గొప్పతనం అని ఆ ట్రిబ్యునల్ లో ప్రణాళిక బద్ధంగా అడ్వకేట్లను పెట్టుకుని వాదించుకుంటే తెలంగాణకు 650 టీఎంసీలకు నీటి వాటా వచ్చే అవకాశం ఉందన్నారు. 1050 టీఎంసీల నీటిని ఫ్రైస్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు నీటిని కేటాయింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఈ నూతన ట్రిబ్యునల్ వేస్తే కేసీఆర్ మొన్నటి ప్రెస్ మీట్ లో మాత్రం 1005 టీఎంసీలు డిస్ట్రిబ్యూట్ చేస్తోందని అన్నారన్నారు. నదులకు నడక నేర్పిన కేసీఆర్ ఈ నంబర్లు మరోసారి సరిచూసుకోవాలన్నారు. ట్రిబ్యునల్ ఇరు రాష్ట్రాల మధ్య ఎన్ని నీళ్లు పంపకాలు చేయబోతోందనేది అవగాహన లేని వ్యక్తి పదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించారంటే వింతగా అనిపిస్తోందన్నారు.






