కేసీఆర్ చేసుకున్న ఒప్పందమే తెలంగాణకు మరణశాసనం.. కేంద్ర జలశక్తి మాజీ సలహాదారు వేదిరె శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి కనీసం 500 టీఎంసి నీళ్ల కోసం గట్టిగా పట్టుబట్టాల్సిన సమయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 299 టీఎంసిలకే ఒప్పుకుని సంతకాలు చేసి తెలంగాణకు తీరని నష్టం చేసిందని కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ మాజీ సలహాదారు

కేసీఆర్ చేసుకున్న ఒప్పందమే తెలంగాణకు మరణశాసనం.. కేంద్ర జలశక్తి మాజీ సలహాదారు వేదిరె శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి కనీసం 500 టీఎంసి నీళ్ల కోసం గట్టిగా పట్టుబట్టాల్సిన సమయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 299 టీఎంసిలకే ఒప్పుకుని సంతకాలు చేసి తెలంగాణకు తీరని నష్టం చేసిందని కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ మాజీ సలహాదారు, మహారాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వెదిరె శ్రీరామ్​పేర్కొన్నారు. తెలంగాణ తరఫున సమర్థంగా వాదించి ఉంటే, కనీసం 400 నుంచి 450 టీఎంసి వరకు నీళ్లు పొందే అవకాశం ఉండేది. 2015లో కృష్ణా జలాల వాటా ఒప్పందంలో 299 టీఎంసికి సంతకం చేయడం గత 10 ఏళ్లుగా తెలంగాణకు మరణ శాసనంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పవర్​పాయింట్ ప్రజంటేషన్​చేశారు.

ఈసందర్భంగా వివరిస్తూ పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్‌ఎల్‌బీసీ, డిండి, కోయిల్ సాగర్ వంటి ప్రధాన ప్రాజెక్టులకు అవసరమైన నీళ్లను 2015 వాటర్ షేరింగ్ అగ్రిమెంట్‌లో చేర్చకపోవడం ఘోర తప్పిదం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టులకు కనీసంగా 261.7 టీఎంసి నీళ్లు అవసరం ఉన్నప్పటికీ, వాటిని పరిగణనలోకి తీసుకోకుండా 299 టీఎంసికే ఒప్పుకోవడం అన్యాయమన్నారు. ప్రాజెక్టులు పూర్తయ్యాయని చెబుతున్నప్పటికీ, కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీలు, కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ లేకుండా ఒక్క ఎకరాకు కూడా నీళ్లు అందని పరిస్థితి ఉందన్నారు. ఎన్నికల ముందు మోటార్లు ఆన్ చేసి ప్రాజెక్ట్ పూర్తి అన్న భావన కల్పించడమే తప్ప, రైతులకు వాస్తవంగా నీళ్లు అందలేదు.

ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్‌లోని పరిమితులతో తెలంగాణకు అన్యాయం జరిగింది, దీనిని సరిదిద్దేందుకు మోడీ ప్రభుత్వం 2023న గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసి కొత్త టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చిందన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఆలస్యం చేయడంతో ఏపీకి వర్క్ ఆర్డర్లు ఇచ్చే అవకాశం దొరికింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల హయాంలో పోతిరెడ్డిపాడు ద్వారా నాలుగు టీఎంసిలుగా ఉన్న నీళ్ల చోరీ 10 టీఎంసీలకు పెరిగింది. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు నిజమైన న్యాయం జరగాలంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ట్రిబ్యునల్ ద్వారానే సాధ్యమని అభిప్రాయ పడ్డారు.

Next Story