- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెట్టింగ్ యాప్స్ నిషేధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం హర్షణీయమే కానీ.. మరో అనుమానం లేవనెత్తిన సజ్జనార్
ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు(Online Gaming Bill)కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు(Online Gaming Bill)కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటుతో ఈ బిల్లు ఆమోదం పొందింది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్(Betting Apps)లకు కొంతమంది బానిస కావడం, మనీలాండరింగ్, ఆర్థిక మోసాల వంటివి ఇటీవల కాలంలో పెరిగిపోయిన నేపథ్యంలో కేంద్రం ఈ బిల్లును ప్రవేశపెట్టింది. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంపై వీసీ సజ్జనార్(VC Sajjanar) స్పందించారు. బెట్టింగ్ యాప్స్ నిషేధంపై కేంద్రం తీసుకున్న నిర్ణయం హర్షణీయం అని పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్స్‌తో పాటు మరికొన్నింటినీ నిషేధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ, ఏపీలో యాప్స్‌పై నిషేధం ఉన్నప్పటికీ దొడ్డిదారిన వస్తున్నారని అన్నారు. ఇతరమార్గాల ద్వారా బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు మళ్లీ మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉందని వీసీ సజ్జనార్ తెలిపారు. యాప్స్‌పై నిషేధం విధించడంతో నిర్వహణ బాధ్యత కిందిస్థాయి పోలీస్ అధికారులపై ఉందన్నారు. కాగా, బెట్టింగ్ యాప్‌లకు వ్యతిరేకంగా గతకొంతకాలంగా సజ్జనార్ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.






