- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
VC Sajjanar: అతి గారాబం వద్దు.. తల్లిదండ్రులు పిల్లలకు ఏం నేర్పిస్తున్నారు! వీసీ సజ్జనార్
మా పిల్లవాడు పెద్ద పెద్ద వాహనాలు నడుపుతున్నాడని తల్లిదండ్రులు సంతోష పడుతుంటారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మా పిల్లవాడు పెద్ద పెద్ద వాహనాలు నడుపుతున్నాడని తల్లిదండ్రులు సంతోష పడుతుంటారు. కానీ పిల్లలకు, మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరం. వారు డ్రైవింగ్ బాగా నేర్చుకున్నా కూడా వారి వయసు, పరిణితి వాహనాలు నడపడానికి సరిపోవని మోటార్ వెహికల్ యాక్ట్ చెబుతోంది. తెలిసి కూడా మోటార్ వెహికిల్ యాక్ట్‌ను గాలికి వదిలేసి కొంత మంది తల్లిదండ్రులు మైనర్ల చేతికి వాహనాలు ఇచ్చి వారి ప్రాణాలు లేదా ఇతరుల ప్రాణాల మీదకు తెచ్చిన ఘటనలు ఎన్నో చూసుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ చిన్న పిల్లవాడు జీప్ నడుపుతున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
వీడియోను శనివారం ఎక్స్ వేదికగా టీవీఎస్ ఆర్టీసీ ఎండీ, వీసీ సజ్జనార్ (VC Sajjanar) ట్వీట్ చేశారు. ‘పిల్లల విషయంలో తల్లి దండ్రుల అతి గారాబం పనికి రాదు. చిన్నతనం నుంచే వారితో ఇలాంటి ప్రమాదకర పనులు చేయిస్తూ.. ఏం నేర్పిస్తున్నారు. జరగరాని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు’ అని సజ్జనార్ రాసుకొచ్చారు. ఈ అంశంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ‘ఈ మధ్య ఇదో సరదా అయిపోయింది ప్రతోడికి. పిల్లలతో చేయకూడని పనులు చేయించి, వాటిని సోషల్ మీడియాలో పెట్టి, వాళ్ళకి హైప్ తేవాలని చూడటం. ప్రమాదం జరిగిన తర్వాత బాధ పడటం కంటే, ముందుగానే జాగ్రత్తగా ఉండటం మంచిదిగా’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ ఆసక్తికరంగా మారింది. పిల్లలు వయసుకు తగ్గ పనులు చెయాలని, వారి కుటుంబానికి కౌన్సిలింగ్ ఇవ్వాలని ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. పోలీసులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న ఆ తల్లిదండ్రులను అరెస్టు చేయాలని చాలా మంది నెటిజన్లు డిమాండ్ చేశారు. వారిని 24 గంటల పాటు జైల్లో పెట్టాలని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌కు ఓ నెటిజన్ ట్యాగ్ చేశారు.






