- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా చార్జ్ తీసుకున్న వీసీ సజ్జనార్
హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌గా వీసీ సజ్జనార్(VC Sajjanar) బాధ్యతలు స్వీకరించారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌గా వీసీ సజ్జనార్(VC Sajjanar) బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు కమిషనర్‌గా ఉన్న సీవీ ఆనంద్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ స్థానంలో ఇప్పటికే వై.నాగిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. ఆర్టీసీకి నాలుగేళ్లు సేవలు అందించడం సంతృప్తినిచ్చిందని, సమష్టికృషితో సంస్థలో వినూత్న కార్యక్రమాలు చేపట్టి విజయవంతం చేశామని సజ్జనార్ అన్నారు. సోమవారం సజ్జనార్‌కు ఆర్టీసీ సంస్థ అధికారులు, సిబ్బంది వీడ్కోలు సభ నిర్వహించారు. సజ్జనార్ వీడ్కోలు తీసుకున్న సందర్భంగా ‘ఎక్స్’లో ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘నా స్టాప్ వచ్చేసింది. బస్సు దిగి, కొత్త మార్గంలో పయనించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రయాణాలు ఆగుతాయి, ప్రయాణికులు ముందుకు కదులుతారు. కానీ రహదారి ఎళ్లప్పుడు ముందుకు సాగుతూనే ఉంటుంది’ అని పేర్కొన్నారు. అంతకుముందు హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల నిర్వహణకు (Law & Order) గట్టిగా కృషి చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్‌లో సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలను అరికట్టడం తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ముఖ్యంగా రౌడీషీటర్ల అరాచకాలపై ఉక్కుపాదం మోపుతామని.. వారు ఎవరైనా గీత దాటితే వారిపై పీడీ యాక్ట్‌లు (PD Acts) నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.






