సజ్జనార్ కీల‌క పోస్ట్‌...ఏకంగా 5,000 మంది పోలీసుల‌తో

by velandi.Saikiran |

సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్‌ సజ్జనార్ కీల‌క పోస్ట్ పెట్టారు. హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేసే దిశగా

సజ్జనార్ కీల‌క పోస్ట్‌...ఏకంగా 5,000 మంది పోలీసుల‌తో
X

దిశ‌, వెబ్ డెస్క్‌: సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్‌ సజ్జనార్ కీల‌క పోస్ట్ పెట్టారు. హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేసే దిశగా, డిసెంబ‌ర్ 5న రాత్రి 10 గంటల నుంచి 'ఆపరేషన్ కవచ్' (Operation Kavach) పేరుతో నగరవ్యాప్తంగా విస్తృతమైన నాకాబందీని నిర్వహించిన‌ట్లు పేర్కొన్నారు. ​హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని రీతిలో చేపడుతున్న ఈ కార్యక్రమంలో దాదాపు 5,000 మంది పోలీసు సిబ్బంది పాల్గొంటున్నారు. ఏకకాలంలో 150 కీలక ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపడుతున్నామని వివ‌రించారు స‌జ్జ‌నార్‌.

​ఈ ప్రత్యేక డ్రైవ్‌లో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, టాస్క్ ఫోర్స్ విభాగాలతో పాటు ఆర్మ్‌డ్ రిజర్వ్, బ్లూ కోల్ట్స్ మరియు పెట్రోలింగ్ బృందాలు సంయుక్తంగా పాల్గొంటున్నాయని తెలిపారు. ​ప్రజా భద్రత కోసం చేపట్టిన ఈ కార్యక్రమంలో నగర పౌరులందరూ పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరుతున్నామన్నామ‌ని సజ్జనార్ కీల‌క పోస్ట్ పెట్టారు. ఎక్కడైనా అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే డయల్ 100 కు సమాచారం అందించగలరని కోరారు.

Next Story