మూడు రోజులు అతి భారీ వర్షాలు.. ఆ రెండు రోజుల్లో క్లౌడ్ బరస్టుకు అవకాశం

by Malleboina Mahesh |   (  Updated:2025-09-22 07:15:19  IST  )

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఏపీ, తెలంగాణ మీదుగా పయనిస్తుండటంతో ఈ నెల 25 నుంచి 27 మధ్య.. రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

మూడు రోజులు అతి భారీ వర్షాలు.. ఆ రెండు రోజుల్లో క్లౌడ్ బరస్టుకు అవకాశం
X

దిశ, వెబ్ డెస్క్: ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాల (heavy rains)కు అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ (Department of Meteorology) మరో పిడుగులాంటి వార్తను చెప్పింది. ఉత్తర, పశ్చిమ, తూర్పు తెలంగాణలో Telangana() మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం (weather station) అంచనా వేసింది. అలాగే ఈ రోజు మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, జనగాం, వరంగల్, కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల & జయశంకర్-ములుగు జిల్లాలను కలుపుకొని భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. అలాగే హైదరాబాద్ నగరంలో సాయంత్రం-రాత్రి వేళల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు (Moderate to heavy rains) కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం (Vayugundam) తీవ్రరూపం దాల్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఆ వాయుగుండం ఏపీ తెలంగాణ మీదుగా పయనిస్తుండటంతో ఈ నెల 25 నుంచి 27 మధ్య.. రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా 26, 27 తేదీల్లో సెంట్రల్ తెలంగాణలో క్లౌడ్ బరస్టు లాంటి వర్షాలు (like Cloudburst rains) కురిసేందుకు అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే వాయుగుండం తన దిశను మార్చుకుంటే ప్రభావం కాస్త తగ్గే అవకాశం ఉన్నప్పటికీ రెండు రోజులు మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. పూర్తి వివరాలు.. వాయుగుండం పయనం పై ఆధారపడి ఉంటాయని అధికారులు తెలిపారు.

Next Story