phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన వట్టే జానయ్య

by Prasad Jukanti |

ఫోన్ ట్యాపింగ్ కేసులో వట్టెజానయ్య స్టేట్ మెంట్ రికార్డు చేశారు.

phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన వట్టే జానయ్య
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone tapping case) విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఇవాళ బీసీ నేత వట్టే జానయ్య (Vatte Janaiah) విచారణకు హాజరయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి బీఎస్పీ తరఫున పోటీ చేశారు. ఎన్నికలప్పుడు వట్టే జాన్యయ ఫోన్ ట్యాపింగ్ అయినట్లు సిట్ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆయనను సిట్ అధికారులు విచారణకు పిలవగా ఇవాళ ఇవాళ దర్యాప్తు అధికారుల ముందు హాజరైన వట్టే జానయ్య నుంచి అధికారులు వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. కాగా ఈ కేసులో ఇవాళ ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మరోసారి సిట్ ముందు హాజరు కానున్నారు. సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఆయనను మరోసారి ప్రశ్నించబోతున్నట్లు తెలుస్తోంది.

Next Story