హరీష్ రావుపై విమర్శలు.. వైరల్ వీడియోపై స్పందించిన వంటేరు ప్రతాప్ రెడ్డి

by Ajay Maddhiboyina |

గతంలో హరీష్ రావుపై చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి స్పందించారు. కేసీఆర్‌ను ఓడించాలని హరీష్ రావు తనకు ఫోన్ చేసినట్టు వంటేరు ప్రతాప్ రెడ్డి గతంలో ఓ సమావేశంలో చెప్పారు.

హరీష్ రావుపై విమర్శలు.. వైరల్ వీడియోపై స్పందించిన వంటేరు ప్రతాప్ రెడ్డి
X

దిశ‌, వెబ్ డెస్క్: గతంలో హరీష్ రావుపై చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి స్పందించారు. కేసీఆర్‌ను ఓడించాలని హరీష్ రావు తనకు ఫోన్ చేసినట్టు వంటేరు ప్రతాప్ రెడ్డి గతంలో ఓ సమావేశంలో చెప్పారు. అదే విషయాన్ని నిన్ని కవిత మీడియా సమావేశంలో చెప్పగా వంటేరు వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కాగా ఆ వీడియోపై నేడు ఆయన స్పందించారు. ఆ రోజుల్లో రాజకీయాల్లో నిలదొక్కుకునేందుకే వాస్తవాలు కాకపోయినా హరీష్ రావుపై విమర్శలు చేశానని చెప్పారు.

ఆ విమర్శలు అవాస్తవం అని అన్నారు. తనది తప్పు అని అప్పుడే ఒప్పుకున్నానని చెప్పారు. కొందరు దద్దమ్మలు ఆ పాత వీడియోలను ఇప్పుడు తిప్పుతున్నారని.. ఆ సన్నాసులకు చెప్పులతో సన్మానం చేస్తామని హెచ్చరించారు. అప్పుడు మల్లన్న సాగర్ విషయంలో కూడా తాను తప్పుగా మాట్లాడానని చెప్పారు. హరీష్ రావు దగ్గర మీరు చేసింది కరెక్ట్ నేను చేసింది తప్పు అని అప్పుడే ఒప్పుకున్నానని తెలిపారు. అప్పుడు తాను కాంగ్రెస్ పార్టీలో ఉండి మల్లన్నసాగర్ మీద కొట్లాడినా కూడా తప్పు ఒప్పుకున్నానని చెప్పారు.

Next Story