- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vanguard: సీఎం రేవంత్ రెడ్డితో వాన్‌గార్డ్ ప్రతినిధుల భేటీ.. 2300 ఉద్యోగాల కల్పనకు లైన్ క్లియర్
సీఎం రేవంత్ రెడ్డితో ఆ సంస్థ ప్రతినిధుల బృందం భేటీ అయింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రాం భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఇప్పటికే పలు కీలక సంస్థలు రాష్ట్రంలో ఇన్వెస్ట్ మెంట్ చేసేందుకు ముందుకు రాగా తాజాగా ప్రపంచంలోని అగ్రశ్రేణి పెట్టుబడి నిర్వహణ కంపెనీలలో ఒకటైన వాన్‌గార్డ్ (Vanguard) సంస్థ రాష్ట్రంలో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ (GCC) ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దేశంలోనే తొలి కార్యాలయం హైదరాబాద్ లోనే స్థాపించనున్నట్లు వ్యాన్ గార్డు సంస్థ వెల్లడించింది. దీంతో హైదరాబాద్ కార్యాలయంలో 2,300 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఏఐ, డేటా సెంటర్, మొబైల్ ఇంజినీరింగ్ నిపుణులకు అవకాశాలు రానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇవాళ వాన్ గార్డు కంపెనీ ప్రతినిధులు హైదరాబాద్ లో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆ సంస్థ సీఈవో సలీమ్ రామ్ జీ, సీఐఓ ఐటీ విభాగం ఎండీ నితన్ టాండన్, చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ జాన్ కౌచర్, జీసీసీ-వాన్ గార్డు ఇండియా ప్రిన్సిపాల్ హెడ్ వెంకటేశ్ నటరాజన్, సీఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెట్టుబడుల అంశంపై చర్చించారు.
గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల హబ్ హైదరాద్ : సీఎం రేవంత్ రెడ్డి
హైదరాద్ ను గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల హబ్ గా చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. వాన్‌గార్డ్ సంస్థ హైదరాబాద్ లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ ఏర్పాటుకు ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. వాన్‌గార్డ్‌ను ఎదురులేని హైదరాబాద్ రైజింగ్ దృక్పథంలో చేరడానికి నేను సంతోషంగా ఉన్నానన్నారు. తెలంగాణ రైజింగ్‌లో భాగంగా, మేము హైదరాబాద్‌ను ప్రపంచవ్యాప్తంగా జీసీసీ కేంద్రంగా రూపొందిస్తున్నాము. వాన్‌గార్డ్ ఆమోదం మా ప్రపంచ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని సీఎం చెప్పారు.
ప్రభుత్వ స్నేహపూర్వక విధానాల వల్లే రాష్ట్రానికి: వాన్‌గార్డ్ సీఈవో
అనంతరం వాన్ గార్డు సీఈవో సలీం రామ్ జీ (Salim Ramji) మాట్లాడుతూ ప్రభుత్వ సానుకూల పాలసీల వల్లే తమ సంస్థ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్ ను ఎంచుకున్నామని తెలిపారు. హైదరాబాద్ లో అన్ని రకాల నిపుణులు ఉన్నారని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, మొబైల్ ఇంజనీరింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించి ఇంజనీర్లను వెంటనే నియమించుకోవాలని చూస్తామని తెలిపారు.
Read More..
వీరికీ కేసీఆర్‌కి పట్టిన గతే! HCU భూముల వేలంపై ఎంపీ ఈటల ఆసక్తికర ట్వీట్






