- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
VANDE BHARATH EXPRESS: విశాఖ-సికింద్రాబాద్.! వందే భారత్ షెడ్యూల్ లో మార్పు
by Geesa Chandu |
విశాఖ నుంచి సికింద్రాబాద్ నగరాల మధ్య నడిచే సెమీ హై స్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ షెడ్యూల్ లో రైల్వే అధికారులు మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ 10 నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుంది.

X
దిశ, వెబ్ డెస్క్: విశాఖ నుంచి సికింద్రాబాద్ నగరాల మధ్య నడిచే సెమీ హై స్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ షెడ్యూల్ లో రైల్వే అధికారులు మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ 10 నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుంది. విశాఖ-సికింద్రాబాద్ రైలుకు ప్రతి మంగళవారం విరామం ప్రకటించారు. ప్రస్తుతం ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆదివారం మినహా.. మిగిలిన అన్ని రోజుల్లో నడుస్తుంది. విశాఖ-సికింద్రాబాద్ మధ్య రెండు వందే భారత్ రైళ్లు నడుస్తున్న సంగతి తెలిసిందే.! ఈ రూట్లో పలు ఎక్స్ప్రెస్ రైళ్లు ఉన్నప్పటికీ.. రద్దీని దృష్టిలో ఉంచుకొని, రెండో వందే భారత్ రైలును కేంద్రం ఈ ఏడాది మార్చి నుంచి అందుబాటులోకి తెచ్చింది.
Next Story






