Vamsichander Reddy: నా ఓటమికి రేవంత్ రెడ్డి కారణం కాదు.. తీన్మార్ మల్లన్నకు వంశీచందర్ రెడ్డి కౌంటర్

by Prasad Jukanti |   (  Updated:2025-03-05 09:21:40  IST  )

ఎంపీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి సీఎం రేవంత్ రెడ్డి కారణం అంటూ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలకు వంశీ చందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

Vamsichander Reddy: నా ఓటమికి రేవంత్ రెడ్డి కారణం కాదు.. తీన్మార్ మల్లన్నకు వంశీచందర్ రెడ్డి కౌంటర్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) ఉద్దేశించి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) చేసిన వ్యాఖ్యలపై సీడబ్ల్యూసీ మెంబర్ వంశీచందర్ రెడ్డి (Vamsi Chander Reddy) స్పందించారు. మహబూబ్ నగర్ స్థానంలో నా ఓటమికి సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేశారని మల్లన్న చేసిన వ్యాఖ్యలను వంశీచందర్ రెడ్డి ఖండించారు. మల్లన్న వ్యాఖ్యలు నిజం కావని కేవలం ఉనికి కోసమే మల్లన్న నేను ఓడిపోవడానికి సీఎం రేవంత్ రెడ్డి కారణం అంటూ మాట్లాడుతున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నేను మహబూబ్ నగర్ (Mahbub Nagar MP) నుంచి ఎంపీగా పోటీ చేయాలన్నది అధిష్టానం నిర్ణయం. నా గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో శ్రమించారు. బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) కుమ్మక్కు రాజకీయాలలో భాగంగానే మహబూబ్ నగర్ లో బీజేపీ గెలిచించన్నారు. కవిత జైల్లో ఉండడంతో ఆమెను బయటకు తెచ్చేందుకు బీఆర్ఎస్, బీజేపీకి అమ్ముడుపోయిందని గతంలో కేసీఆర్ లాంటి వాళ్ళు ఎంపీగా పని చేసిన మహబూబ్ నగర్ లో సిట్టింగ్ బీఆర్ఎస్ సీట్లో బీఆర్ఎస్ డిపాజిట్ కోల్పోయి బీజేపీ కి మద్దతు ఇచ్చిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి నుంచి గ్రామ స్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరు నా గెలుపు కోసం సమిష్ట కృషి చేశారన్నారు.

Next Story