Vakiti Srihari: బాధ్య‌తలు స్వీక‌రించిన మంత్రి వాకిటి శ్రీహ‌రి

by Prasad Jukanti |

వాకిటి శ్రీహరి సచివాలయంలో తనకు కేటాయించిన శాఖల బాధ్యతలు స్వీకరించారు.

Vakiti Srihari: బాధ్య‌తలు స్వీక‌రించిన మంత్రి వాకిటి శ్రీహ‌రి
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో:తెలంగాణ ప్రభుత్వంలో పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా నియమితులైన వాకిటి శ్రీహరి (Vakiti Srihari) బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం డా.బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం చేరుకున్న మంత్రి వాకిటి శ్రీహరిని వేదమంత్రోచ్చారణలతో పండితులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన తనకు కేటాయించిన చాంబర్ లో ప్రత్యేక పూజలు చేసి బాధ్యలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. బాధ్యతలు చేపట్టిన వాకిటి శ్రీహరికి మంత్రి జూపల్లితో పాటు పలువురు నేతలు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఇటీవల జరిగిన కేబినెట్ విస్తరణలో వాకిటి శ్రీహరితో పాటు అడ్లూరి లక్ష్మణ్, గడ్డం వివేక్ కు స్థానం దక్కిన సంగతి తెలిసిందే. వీరికి శాఖలను కేటాయించడంతో తాజాగా బాధ్యతలు చేపడుతున్నారు.

Next Story